Home » షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాల‌కృష్ణ‌, కృష్ణ‌, కృష్ణంరాజు.. వారు ప్రాణాల‌ను ఎలా కాపాడుకున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోక ఉండ‌రు..!

షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాల‌కృష్ణ‌, కృష్ణ‌, కృష్ణంరాజు.. వారు ప్రాణాల‌ను ఎలా కాపాడుకున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోక ఉండ‌రు..!

by Anji
Ad

నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అత‌ను ఏ సినిమా తీసినా ఓ సెన్షేష‌న్ అనే చెప్పాలి. 1999లో బాల‌కృష్ణ న‌టించిన సుల్తాన్ సినిమా గురించి అంద‌రికీ తెలిసిందే. సినిమా సూప‌ర్ హిట్ కాక‌పోయినా యావ‌రేజ్‌గా ఆడింది. ఈ సినిమా స‌క్సెస్ గురించి పక్క‌కు పెడితే ఇందులో ముగ్గురు కృష్ణ‌లు పోటీప‌డి న‌టించడం విశేషం. బాల‌కృష్ణ సుల్తాన్ సినిమాలో హీరో అండ్ విల‌న్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించి ప్రేక్ష‌కుల వద్ద మంచి మార్కులే సంపాదించారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  ప్ర‌ముఖ న‌టుడు వ‌డ్డే న‌వీన్ భార్య ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

Advertisement

ఇక సూప‌ర్ స్టార్‌ కృష్ణ ప‌వ‌ర్‌పుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు ఇద్ద‌రు థియేట‌ర్స్ లో విజువ‌ల్స్ ప‌డేవిధంగా న‌టించారు. ఇలా ముగ్గురు కృష్ణ‌లు ఉండ‌డంతో ఈ సినిమా విడుద‌ల‌కు ముందే అప్ప‌ట్లో ఓ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా బాల‌య్యను ట్రైల‌ర్ లో ప‌లు పాత్ర‌ల్లో చూసి ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలుస్తుంద‌ని అంద‌రూ ఊహించారు. కానీ సినిమాకి ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ అండ్ రైట‌ర్స్ అయిన ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. ఇందులో ముగ్గురు హీరోల్లో ఎవ‌రి ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టు వారి పాత్ర‌ల‌ను క్రియేట్ చేశారు. ఈ సినిమా క‌థ రాసుకున్న‌ప్పుడు ఒక ప‌వ‌ర్ పుల్ సీబీఐ ఆఫీస‌ర్‌గా, ఒక పోలీస్ ఆఫీస‌ర్ గా ఎవ‌రైతే బాగుంటార‌ని చర్చ‌లు జ‌రిగాయ‌ట‌. అప్పుడు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌ని సీబీఐ ఆఫీస‌ర్ గా కృష్ణంరాజుని పోలీస్ ఆఫీస‌ర్‌గా కృష్ణ తీసుకుంటే బాగుంటుంద‌ని సూచించార‌ట‌.

Advertisement

ఈ సినిమా షూటింగ్‌ని తొలుత సీనియ‌ర్ హీరోలు అయిన‌టువంటి కృష్ణ‌, కృష్ణంరాజుల‌కు సంబంధించిన పార్ట్‌ను తొలుత చేద్దామ‌ని బాల‌కృష్ణ సూచించాడ‌ట‌. సినిమా షూటింగ్ అండ‌మాన్ దీవుల్లో ఉండ‌డంతో స‌ర‌దాగా మ‌న ఫ్యామిలీస్ తో ట్రిప్ వేసిన‌ట్టు ఉంటుంద‌ని అనుకొని కృష్ణ‌, కృష్ణంరాజు, బాల‌కృష్ణ వాళ్ల ఫ్యామిలీస్‌ని వెంట బెట్టుకొని అంద‌రూ అండ‌మాన్ వెళ్లార‌ట‌. అక్క‌డ వాతావ‌ర‌ణం, లొకేష‌న్లు బాగున్న‌ప్ప‌టికీ ఉండ‌డానికి మాత్రం రాజీవ్ గాంధీ గెస్ట్ హౌజ్ త‌ప్ప వేరే ఏమి లేవ‌ట‌. తిన‌డానికి తిండికూడా దొరికేది కాద‌ట‌. చేసేదేమి లేక అంద‌రూ అక్క‌డే అడ్జ‌స్ట్ అయ్యారు. అక్క‌డికి వెళ్లిన రోజు అయితే అక్క‌డ తిన‌డానికి కూడా ఏమి లేక‌పోవ‌డంతో బిస్కేట్లు, చిన్న చిన్న చిరుతిండ్ల‌తో కాలం గ‌డిపేశార‌ట‌.

ఇవి కూడా చద‌వండి :  మీకు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా..? అయితే మీ కిడ్నిలో రాళ్లు వ‌చ్చిన‌ట్టే జాగ్ర‌త్త‌..!

 

ఆ త‌రువాత రోజు బ‌య‌ట ఎక్క‌డి నుంచో బియ్యం కూర‌గాయలు తెప్పించార‌ట‌. వాటితో అద్భుతంగా విజ‌య నిర్మ‌ల వంట చేసి పెడితే అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తిన్నార‌ట‌. అంతేకాదు..బాల‌య్య ఎక్క‌డ ఉన్నా అంద‌రితో బాగా క‌లిసిపోతాడు. దీంతో స‌ముద్రంలోని చేప‌ల‌ని వేటాడీ మ‌రీ ప‌ట్టుకొచ్చి విజ‌య నిర్మ‌ల‌కి ఇచ్చాడు. ఆమె వాటితో చేప‌ల పులుసు పెట్టింద‌ట‌. ఆ చేప‌ల పులుసు అదిరిపోవ‌డంతో లొకేష‌న్‌లోకి కూడా ప‌ట్టుకెళ్లార‌ట‌. సినిమా టీం అంతా విజ‌య‌నిర్మ‌ల వంట‌ని ఔరా అంటూ తిన్నార‌ట‌. దీంతో ఇండ‌స్ట్రీలో విజ‌య‌నిర్మ‌ల చేప‌ల పులుసుకు మంచి పేరు వ‌చ్చింది. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ చిత్రంలో ముగ్గురు కృష్ణులు న‌టించ‌డం వాళ్ల ఫ్యామిలీ అంద‌రితో క‌లిసి అండ‌మాన్ వెళ్లి స‌ర‌దాగా గ‌డపం వంటివి చాలా అరుదుగా జ‌రుగుతుంటాయ‌నే చెప్ప‌వ‌చ్చు.

ఇవి కూడా చద‌వండి :  సూప‌ర్ స్టార్ కృష్ణ కొడుకు ర‌మేష్ బాబు ఆ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నాడు..!

Visitors Are Also Reading