Telugu News » Blog » Kabzaa Review Telugu : కబ్జా మూవీ రివ్యూ..మొత్తం KGF ను దించేశాడా ?

Kabzaa Review Telugu : కబ్జా మూవీ రివ్యూ..మొత్తం KGF ను దించేశాడా ?

by Bunty
Ads

Kabzaa Review in Telugu: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో. ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు. ‘కన్యాదానం’, ‘ఉపేంద్ర’, ‘రా’, ‘ఒకే మాట’ లాంటి ఉపేంద్ర నటించిన ఎన్నో చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. హీరోగానే కాకుండా ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘గని’ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉపేంద్ర తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తెలుగులో చాలా కాలంగా కనిపించని ఉపేంద్ర క్రేజ్ మళ్లీ ‘కబ్జ’ సినిమాతో కనిపించింది. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Advertisement

READ ALSO: మాస్టర్ సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంతలా మారిపోయిందో చూడండి!

Kabzaa Movie Story  in Telugu: కథ మరియు వివరణ

1947 నుంచి 1984 కాలంలో నడిచే కథే కబ్జ. ఒక స్వాతంత్ర సమరయోధులు కొడుకు, బ్రిటిష్ పాలనలో వైమానిక దళాధిపతి అయిన ఉపేంద్ర, అనివార్య పరిస్థితుల కారణంగా మాఫియా వరల్డ్ లో ఎలా చిక్కుకున్నాడు. తర్వాత ఏ రేంజ్ కు చేరుకున్నాడనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. నిజానికి ఈ స్టోరీ విన్నా, ట్రైలర్ చూసిన కేజిఎఫ్ గుర్తుకురావడం ఖాయం. ఆ మూవీ రెండు భాగాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో వాటి ప్రభావం ఈ మూవీపై పడినట్లు మేకింగ్ చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. కేజీఎఫ్ తర్వాత కన్నడ నాట ఆ స్థాయిలో ఆసక్తి రేపిన మూవీ ఇది.

Advertisement

READ ALSO : రాజయోగం కోసమే NTR రెండు పెళ్లిళ్లు చేసుకున్నారా… దీనికి కారణం అతనే !

Kabzaa Review in Telugu

Kabzaa Review in Telugu

నిజానికి ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు కేజిఎఫ్ సెట్ లోనే తీసిన మరో సినిమా, అచ్చు దానిలాగే ఉందన్న విమర్శలు కూడా వచ్చాయి. అయినా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. నిజానికి గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మొత్తానికి ఇప్పుడు వచ్చింది. కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగదీసిన రవి బస్రురే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందించారు. కబ్జా సినిమా మొత్తం ఉపేంద్ర షో. 10 నిమిషాల కేమియో నిరాశపరుస్తుంది. శ్రియ శరన్ ఆకట్టుకుంటుంది. ఒక సీన్ లో శివన్న (శివరాజ్ కుమార్) కనిపిస్తారు. కేజీఎఫ్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుంది. డల్ కలర్ టోన్. మ్యూజిక్ పర్వాలేదు. విఎఫ్ఎక్స్ అస్సలు బాగాలేదు. స్టోరీ నేరేషన్ ఏమాత్రం గ్రిప్పింగ్ గా లేదు. సాధారణ గ్యాంగ్ స్టర్ మూవీ. క్లైమాక్స్ లో వచ్చే పార్ట్ 2 కి లీడ్ ఇచ్చింది.

 

ప్లస్‌ పాయింట్స్‌
నటీ నటుల నటన
మ్యూజిక్‌
దరకత్వం
ఉపేంద్ర షో

మైనస్‌ పాయింట్స్‌
రొటీన్‌ కథ
కేజీఎఫ్‌ ను పోలీ ఉండటం

రేటింగ్‌ 2.5/5

Advertisement

READ ALSO : David Warner : ఐపీఎల్‌లో మళ్లీ కెప్టెన్‌గా ఛాన్స్‌ కొట్టేసిన డేవిడ్‌ వార్నర్‌