Home » అమెజాన్ ప్రైమ్‌లో సీతారామం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

అమెజాన్ ప్రైమ్‌లో సీతారామం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Anji
Ad

దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ లు న‌టించిన అద్భుత ప్రేమ‌కావ్యం సీతారామం. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా తెలుగులో మంచి విజ‌యం సాధించింది. తెలుగులోనే కాకుండా మ‌ళ‌యాళంలో మంచి హిట్ గా నిలిచింది. ఇక ఈ ప్రేమ‌కావ్యం తాజాగా హిందీలో కూడా విడుద‌లైంది. వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో మెగా ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నిద‌త్ నిర్మాత‌గా స్వ‌ప్న‌ సినిమా ప‌తాకంపై హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీతారామం. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన ఈ సినిమా సూప‌ర్ టాక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఈ చిత్రం రూ.40కోట్ల షేర్‌ని రూ.80కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకొని కేక పెట్టించింది.


ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుద‌ల‌పై తాజా అప్‌డేట్ వ‌చ్చింది. ఈ మూవీ ప్ర‌ముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 9 నుంచి స్ట్రీమింగ్‌కి రానుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ దాదాపు పూర్తి కావ‌డంతో ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. చూడాలి మ‌రి అక్క‌డ ఎలా అలరించ‌నుందో ఇక ఈ సినిమా హిందీలో విడుద‌లై మంచి టాక్‌ని తెచ్చుకుంది. ఈ సినిమాలో న‌టించిన దుల్క‌ర్‌, మృణాల్‌, ర‌ష్మిక ఈ ముగ్గురికి అక్క‌డ మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి వ‌సూళ్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని అంటున్నాయి. ట్రేడ్ వ‌ర్గాలు.. ఈ సినిమా ని హిందీలో పెన్ మూవీస్ విడుద‌ల చేసింది. ఈ సంస్థ గ‌తంలో ఆర్ఆర్ఆర్ అక్క‌డ విడుద‌ల చేసిన విష‌యం విధిత‌మే. ఈ చిత్రం తెలుగు వ‌ర్ష‌న్ యూఎస్‌లో 1 మిలియ‌న్ డాల‌ర్ వ‌సూలు చేసింది.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: కృతిసనన్ వలలో పడ్డ ప్రభాస్..ఇక నెక్స్ట్ పెళ్లేనా..?

హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన ఈ సినిమాలో ఎలాంటి అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలు లేక‌పోవ‌డంతో పాటు కుటుంబ స‌మేతంగా చూసే విధంగా ఉండ‌డంతో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. బాక్సాఫీస్ వ‌ద్ద క్లాసిక్ ల‌వ్ స్టోరీ సీతారామం బ్రేక్ ఈవెన్‌ని పూర్తి చేసుకుని అదుర‌గొట్టింది. ఇక హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఎలాంటి అస‌భ్య‌క‌రమైన స‌న్నివేశాలు లేక‌పోవ‌డంతో కుటుంబ స‌మేతంగా చూసేవిధంగా ఉండ‌డంతో ఈ సినిమాకి సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తోంది. దుల్క‌ర్ స‌ల్మాన్ స‌రస‌న మృణాల్ ఠాగూర్ న‌టించారు. ఓ కీల‌క పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న చేసింది. ఈ సినిమాతో సుమంత్.. లెప్ట్‌నెంట్ క‌ల్న‌ల్ విష్ణుశ‌ర్మ పాత్ర‌లో క‌నిపించారు. ఈయ‌న భార్య‌గా భూమిక న‌టించింది. దుల్క‌ర్ స‌ల్మాన్ సైనికుడి పాత్ర‌లో ఆకట్టుకున్నారు. క‌శ్మీర్ విజువ‌ల్స్ ఫోటోగ్ర‌ఫీ బాగున్నాయి. వినోద్ సినిమాటోగ్ర‌ఫీ, విశాల్ చంద్ర‌శేఖ‌ర్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

ఇది కూడా చ‌ద‌వండి :  తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కట్న కానుకలు తీసుకున్న 5 గురు స్టార్ హీరోలు వీరేనా..?

Visitors Are Also Reading