Home » సీతారామం ఓటీటీ డేట్ ఫిక్స్..!

సీతారామం ఓటీటీ డేట్ ఫిక్స్..!

by Azhar
Ad

టాలీవుడ్ లో వరుసగా విడుదలైన అన్ని సినిమాలు ప్లాప్ అవుతున్న సమయంలో థియేటర్లోకి ఒక్కే రోజు వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అందులో ఒక్కటి బింబిసారా కాగా.. మరొక సినిమా సీతారామం. వైజయంతి బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా.. మృనాల్ ఠాకూర్ దుల్కర్ కు జంటగా నటించింది. అయితే ఈ సినిమాలో రష్మిక మందన కూడా ఒక్క కీలక పాత్రలో కనిపిస్తుంది.

Advertisement

అయితే ఈ సినిమా అనేది ఇక్కడ తెలుగులో అంచనాలకు మించి హిట్ కావడంతో దీనిని హిందీలో కూడా విడుదల చేయాలి అని ప్లాన్ చేసిన చిత్ర యూనిట్.. ఈ నెల 2న హిందీలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకొని వెళ్ళింది. అయితే అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ గానే నిలిచింది. అయితే ఈ సినిమా యొక్క ఓటీటీ విడుదల కోసం కూడా ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.

Advertisement

అయితే వారు ఎదురు చూపులకు ఇప్పుడు తెర పడింది అనే చెప్పాలి. హిందీ విడుదల కోసం ఇన్ని రోజులు ఈ సినిమాను ఓటీటీలోకి తేకుండా ఆపారు. కానీ తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకున్న అమెజాన్ విడుదల తేదిని ప్రకటించింది. ఈ నెల 9న సీతారామం సినిమా ఓటీటీ లోకి రాబోతుంది అని అమెజాన్ ప్రోమోను విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి :

అశ్విన్ జట్టులోకి.. ఎందుకో తెలుసా..?

రైనా పేరిట ఉన్న ఈ రికార్డులు మీకు తెలుసా..?

Visitors Are Also Reading