Home » Bro: “బ్రో” లాగా ఒకే అక్షరంతో తెరకెక్కి సూపర్ హిట్ అయిన సినిమాలు.. లిస్ట్ ఓ లుక్ వేయండి..!

Bro: “బ్రో” లాగా ఒకే అక్షరంతో తెరకెక్కి సూపర్ హిట్ అయిన సినిమాలు.. లిస్ట్ ఓ లుక్ వేయండి..!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

సినిమా మీద ఇంప్రెషన్ రావాలి అంటే ముందుగా కనెక్ట్ అయ్యేది ఆ సినిమా టైటిల్. సినిమా టైటిల్ వినగానే మనకి సినిమాపై ఒక ఒపీనియన్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే.. హీరోలు, దర్శక నిర్మాతలు టైటిల్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఈజీగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండే టైటిల్స్ ను ఎంచుకుంటారు. నిన్న మొన్నటి వరకు పెద్ద పెద్ద టైటిల్స్ ట్రెండ్ ఫాలో అయిన టాలీవుడ్.. ఇప్పుడు చిన్న చిన్న టైటిల్స్ ట్రెండ్ ఫాలో అవుతోంది. ప్రస్తుతం సింగల్ లెటర్ ఉన్న టైటిల్స్ పాపులర్ అవుతున్నాయి.

చిన్న టైటిల్ పెట్టడమే కష్టం అనుకుంటే.. సింగల్ లెటర్ టైటిల్ ను సినిమాకు సూటబుల్ గా పెట్టడం మరింత కష్టతరం అని చెప్పొచ్చు. అయితే.. కొందరు దర్శకులు ఈ టైటిల్ పెట్టడాన్ని ఈజీ గా తీసేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేస్తున్నారు. అలా సింగల్ లెటర్ టైటిల్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాల లిస్ట్ పై ఇప్పుడు ఓ లుక్ వేద్దాం.

Advertisement

బ్రో:


పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ లు నటించిన సినిమా బ్రో. ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఈరోజు విడుదల అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

సై:

nithin sye

ఈ సినిమా నితిన్ రాజమౌళి కాంబోలో తెరకెక్కింది. కాలేజీ గొడవల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు.

అ!:

Advertisement


కాజల్, రెజీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేసారు. ఇది కూడా మంచి టాక్ తెచ్చుకుంది.

ఐ:


విక్రమ్ హీరోగా వచ్చిన ఐ ఏ స్థాయిలో హిట్ అయ్యిందో చెప్పకర్లేదు.తమిళ్ సినిమా అయినప్పటికీ తెలుగునాట కూడా సూపర్ హిట్ అయ్యింది.

ఢీ:


మంచు విష్ణు, జెనిలియా జంటగా నటించిన ఢీ సినిమా కూడా అప్పట్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీనికి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు.

స్పై:


నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా స్పై కూడా ఇటీవలే విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇవి కాకుండా, కళ్యాణ్ రామ్ ఓం, తారకరత్న నో, శ్రీ పూర్ణ మూవీస్ వారి” స్త్రీ “, జగపతిబాబు కీ, ఉపేంద్ర నటించిన “రా”, “A” సినిమాలు కూడా సింగల్ లెటర్ తో తీసినవే. ఈ సినిమాలు విడుదల అయినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఈ లెక్కన చూస్తే.. రాబోయే రోజుల్లో సింగల్ లెటర్ తో విడుదల అయ్యే సినిమాల లిస్ట్ పెద్దగానే ఉండేట్లు ఉంది.

మరిన్ని..

మహిళల్లో ఈ 5 లక్షణాలు ఉంటే కుటుంబం నాశనం అవుతుందట..3వది ముఖ్యం !

BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

Visitors Are Also Reading