Home » BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే

BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలలో దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఏడాదికి మూడు సినిమాల చొప్పున చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో బ్రో సినిమా చేశాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ అందించగా దర్శకత్వం మాత్రం సముద్రఖని చేశాడు. ఇక ఈ సినిమాలో ప్రియా వారియర్ తో పాటు కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు.

Advertisement

ఇక ఈ సినిమాలో సాయి ధరంతేజ్ మెయిన్ హీరోగా నటించగా… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం దేవుడి పాత్రలో నటించాడు దాదాపు 80 శాతం వరకు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉందట. ఇది ఇలా ఉండగా ఇవాళ థియేటర్లలో బ్రో సినిమా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇక కొన్ని చానల్స్ ఈ సినిమాకు ఐదుకు మూడు పాయింట్లు రేటింగ్ ఇచ్చాయి. ఇక ఈ సినిమాకు పాజిటివ్ పాయింట్స్ ఉన్నట్లే నెగటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి.

bro-review

Advertisement

ఈ సినిమా కథ బాగా ఉన్నప్పటికీ కథనం విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లు జరిగాయట. వినోదమే సితం సినిమాకు ఈ సినిమా రిమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఒరిజినల్ స్టోరీ లో ఉన్న మంచి ఫీల్ ఈ సినిమాలో లేదట. అలాగే కొన్ని ఎక్స్ ట్రా సీన్లను కూడా జోడించడం వల్ల సినిమా దెబ్బతిందట. ఇక పాజిటివ్ విషయానికి వస్తే… ఈ సినిమాలో కామెడీ మాత్రం అదిరిపోయిందట. సినిమా ల్యాగ్ లేకుండా స్పష్టంగా చూపించారట. అలాగే కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్… పవన్ కళ్యాణ్ పాత సినిమాల పాటలు చాలా వర్క్ అవుట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

Visitors Are Also Reading