Home » హీరోయిన్ల కంటే ఈ సైడ్ క్యారెక్టర్లకే ఎక్కువ ఫిదా అయ్యారు…!

హీరోయిన్ల కంటే ఈ సైడ్ క్యారెక్టర్లకే ఎక్కువ ఫిదా అయ్యారు…!

by Bunty
Ad

 

కొన్ని సినిమాలలో హీరోయిన్ల కంటే సైడ్ క్యారెక్టర్లలో నటించిన వారికే ఎక్కువ క్రేజ్ వస్తుంది. హీరోయిన్స్ పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్, చెల్లి, అక్క పాత్రలు చేసిన వారికి ఎక్కువ పేరు వస్తుంది. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా… ఎక్కువసేపు స్క్రీన్ పై కనిపించకపోయినా కూడా ఫేమస్ అయిపోతుంటారు. అలా ఆడియన్స్ లో ఎక్కువ ఫేమస్ అయ్యి ప్రేక్షకులను సంపాదించుకున్న ఆర్టిస్టులు ఎవరు ఎప్పుడు చూద్దాం.

Advertisement

# వీర సింహారెడ్డి : హనీ రోజ్

ఎక్కువ వయసున్న పాత్రలో నటించినప్పటికీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన హనీ రోజ్ కి ఎక్కువ మంది అభిమానులు ఫిదా అయిపోయారు.

# లవ్ టుడే : రవి నా రవి, ప్రార్థన నాదన్

ఇందులో హీరోయిన్ కంటే కూడా హీరో అక్క దివ్యగా కనిపించిన రవినా…ఆమె ఫ్రెండ్ నమితగా కనిపించిన ప్రార్థన…ఇద్దరికీ ఎక్కువ మంది అభిమానులు ఫిదా అయ్యారు.

# డియర్ కామ్రేడ్ : శృతి రామచంద్రన్

ఇందులో రష్మిక సిస్టర్ జయగా నటించిన శృతి చాలా బాగుందంటూ అప్పట్లో ప్రేక్షకులు కామెంట్స్ చేశారు.

# హిట్-2 : కోమలి ప్రసాద్

హీరోయిన్ మీనాక్షి చౌదరి కంటే పోలీస్ క్యారెక్టర్ లో చేసిన కోమలి ప్రసాద్ కి జనాలు ఫిదా అయ్యారు.

# లవర్స్ డే – నూరిన్

షరీఫ్ చాలామంది ప్రియా ప్రకాష్ కోసమే సినిమా చూసినా… నూరిన్ షరీఫ్ కు ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు.

Advertisement


# ఉయ్యాల జంపాల : పునర్నవి

ఇందులో అవికా ఫ్రెండ్ గా నటించిన పునర్నవికి ఎక్కువమంది ఫిదా అయిపోయారు.

# అశోక వనంలో అర్జున కళ్యాణం : రితికా సింగ్

విశ్వక్సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి కంటే తన చెల్లి క్యారెక్టర్ లో చేసిన రితికాకే అందరూ కనెక్ట్ అయ్యారు.

# ఫిదా : శరణ్య

భానుమతిగా నటించిన సాయి పల్లవి తో పాటు ఆమె అక్క పాత్రలో నటించిన రేణుకకు ఎక్కువమంది ఫ్యాన్స్ అయ్యారు.

# అల వైకుంఠపురంలో : నివేదా పేతురాజ్

హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే కన్నా హీరో మరదలుగా చేసిన నివేదా పేతురాజ్ కి ఎక్కువ మంది ఫిదా అయిపోయారు.

# ఆరెంజ్ : షాజన్ పదంసీ

రామ్ చరణ్ తో ఫ్లాష్ బ్యాక్ లవ్ నడిపించిన రూబాకు ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు.

# అ ఆ : అనుపమ పరమేశ్వరన్

త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో అనుపమ తన క్యూట్ లుక్స్, యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

# బ్రూస్ లీ : కృతికర్బంద

హీరోయిన్ కంటే కూడా హీరో అక్కగా నటించిన కృతి కర్బందాకే ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Ms Dhoni : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆస్పత్రి పాలైన మహేంద్ర సింగ్ ధోని

Varun Tej – Lavanya : వరుణ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ !

భోజనం చేసిన తర్వాత… ఈ తప్పులు చేయకండి!

Visitors Are Also Reading