Home » ప్రశాంత్ నీల్ ఓ ప్రపంచం.. ప్రభాస్ ఓ అద్భుతం…!

ప్రశాంత్ నీల్ ఓ ప్రపంచం.. ప్రభాస్ ఓ అద్భుతం…!

by Azhar
Ad

బాహుబలి సినిమాతో ఒక్కేసారి పాన్ ఇండియా హీరో ఐపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. అలాగే కేజిఎఫ్ అనే ఒక్కే సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు ప్రశాంత్ నీల్. అయితే అలాంటి స్టార్ హీరో.. ఇలాంటి స్టార్ డైరెక్టర్ కలిసి ఇప్పుడు చేస్తున్న సినిమా సాలార్. ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటుగా.. ఇప్పటికే వచ్చిన ప్రభాస్ ఫస్ట్ లుక్ అభిమానులకు తెగ ఆకట్టుకుంది. కానీ అప్పటి నుండి మరో సినిమా అప్డేట్ మాత్రం ఈ సినిమా నుండి రాలేదు అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో పునరభస్ కు జంటగా.. శృతి హాసన్ నటిస్తుంది. ఇక తాజాగా ఈ అమ్మడు వీరిపై కొన్ని కామెంట్స్ చేసింది.

Advertisement

తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ… ప్రశాంత్ నీల్ సినిమాలు అనే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. అలాగే అతని విజన్ బాగుంటుంది అని పేర్కొంది. అందుకే ప్రశాంత్.. తన సినిమాలతో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించగలడు అని తెలిపింది. అందుకే ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో సాలార్ లాంటి సినిమాలో నటించే అవకాశం రావడం తాను చాలా సంతోషంగా ఉంది అని పేర్కొంది. ఇక ఇదే కార్యక్రమంలో ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ.. అతను ఓ అద్భుతం అని పేర్కొంది. అందుకే అతనితో పని చేయడం ఆనదంగా.. సరదాగా అనిపిస్తుంది అని చెప్పింది.

Advertisement

అయితే ప్రస్తుతం శృతి హాసన్ తన సినిమా కెరియర్ ను చాలా జాగ్రత్తగా నిర్మించుకుంటుంది. అందని చూపించడం కంటే.. తన నటనను చూపించి అభిమానులకు దగ్గర కావాలని అనుకుంటుంది. ఇక గత ఏడాది రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శృతి హాసన్… ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సాలార్ అనే సినిమానే కాకుండా.. ఇంకా టాలీవుడ్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస దర్శకుడు మలినేని గోపిచంద్ కాబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా బాలయ్యకు జోడిగా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐని లెక్క చెయ్యని టీం ఇండియా.. విచ్చలవిడిగా..?

వీడ్కోలు పలికిన మోర్గాన్.. ఎందుకు..?

Visitors Are Also Reading