Home » బీసీసీఐని లెక్క చెయ్యని టీం ఇండియా.. విచ్చలవిడిగా..?

బీసీసీఐని లెక్క చెయ్యని టీం ఇండియా.. విచ్చలవిడిగా..?

by Azhar
Ad

ప్రస్తుతం టీం ఇండియా ఇంగ్లాండ్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ పర్యటనను టెస్ట్ మాటీవీహ్ తో ప్రారంభించనుంది భారత్. అయితే ఇది గత ఏడాది వాయిదా పడిన మ్యాచ్. గత పర్యటనలో రెండు జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో నాలుగు టెస్టులు ముగిసిన తర్వాత భారత క్యాంపులో కరోనా కేసులు వచ్చాయి. దాంతో ఆ మ్యాచ్ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా ఈ టెస్ట్ మ్యాచ్ ను కరోనా అడ్డుకుంటుంది అని జర్గుతున్న పరిస్థులను బట్టి చూస్తే అర్ధం అవుతుంది.

Advertisement

ఈ పర్యటనకు వెళ్లే ముందు స్పిన్నర్ అశ్విన్ కు కరోనా రాగ… అక్కడికి వెళ్లిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. అయితే ఇన్ని రోజులు కరోనా వల్ల బయో బాబుల్ లో జరిగిన మ్యాచ్ లు ఇప్పుడు మామూలుగానే జరుగుతున్నాయి. దాంతో ఇంగ్లాండ్ వెళ్లిన భారత ఆటగాళ్లు బయట షాపింగ్ చేస్తూ అభిమానులతో మాస్కులు లేకుండా ఫోటోలు దిగారు. అందువల్ల ఇంగ్లాండ్ లో కరోనా కేసులు ఉన్నాయని.. ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ సూచించింది. కానీ ఆటగాళ్లు వినకపోవడంతో రోహిత్ కరోనా బారిన పడ్డాడు.

Advertisement

 

ఇంత జరిగిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు మారలేదు. అభిమానులకు ఫోటోలు ఇస్తూనే ఉన్నారు. దాంతో మళ్ళీ బీసీసీఐ ఆటగాళ్లకు కరోనా నియమాలు పాటించాలని నిన్న తెలిపింది. కానీ దీనిని కూడా ప్లేయర్స్ పట్టించుకోవడం లేదు. ఈరోజు ఓ హోటల్ లో తినడానికి వెళ్లిన ఆటగాళ్లు మళ్ళీ అక్కడ కూడా ఫ్యాన్స్ తో ఫోటోలు దిగారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. బీసీసీఐ ఆటగాళ్ల పైన చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. మరి బోర్డు ఆదేశాలు పట్టించుకోని ఆటగాళ్లకు ఏ విధమైన శిక్ష బీసీసీఐ విధిస్తుంద అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

భారత భవిష్యత్ కెప్టెన్ పాండ్యనే…!

ఇంగ్లాండ్ క్రికెటర్ తో సచిన్ కొడుకి ప్రేమాయణం..!

Visitors Are Also Reading