Telugu News » ఆ టాలీవుడ్ నిర్మాత‌తో శ్రీ‌రెడ్డి వివాహం..?

ఆ టాలీవుడ్ నిర్మాత‌తో శ్రీ‌రెడ్డి వివాహం..?

by Anji

వివాద‌స్ప‌ద న‌టి శ్రీ‌రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సోష‌ల్ మీడియాను వేదిక‌గా సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌పై కాంట్ర‌వ‌ర్సి సృష్టిస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ. అగ్ర‌హీరోల‌పై ఈమె చేసే కామెంట్లు పెద్ద వివాద‌న్నే సృష్టించే విష‌యం అంద‌రికీ తెలిసిందే. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పై, హీరో నాని తో పాటు మిగతా కొందరు టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల పై నిత్యం విమర్శలు చేస్తూ ఎప్పుడూ వివాదాలను సృష్టిస్తోంది.

Ads

ఇక ఇటీవలే హైదరాబాద్ నుంచి చెన్నైకి మ‌కాం మార్చిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. శ్రీరెడ్డి తన సోషల్ మీడియా చిట్ చాట్ ద్వారా తన అభిమానుల‌కు ఒక కొత్త విషయం చెప్పింది. శ్రీ రెడ్డి పెళ్లి విషయం సోషల్ మీడియాలో చిట్ చాట్ లో భాగంగా ఒక అభిమాని మీ పెళ్ళెప్పుడు అని అడుగగా దానికి శ్రీరెడ్డి సమాధానమిస్తూ.. నేను అందరిలాంటి అమ్మాయినే. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంద‌ని చెప్పుకొచ్చింది.

Who is Sri Reddy? | Entertainment News,The Indian Express

ఈ మ‌ధ్య రిలేష‌న్ షిప్ నాకు న‌మ్మ‌కం పోతుంది. అందుకే న‌న్ను బాగా అర్థం చేసుకునే వారికోసం ఎదురుచూస్తున్నాన‌ని శ్రీ‌రెడ్డి చెప్ప‌డం విశేషం. ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న మ‌రొక న్యూస్ ఏమిటంటే.. శ్రీ‌రెడ్డి ఒక నిర్మాత‌ను పెళ్లి చేసుకోబోతుంద‌ని కొత‌కాలంగా ఆ నిర్మాత‌తో రిలేష‌న్‌లో ఉంద‌ని, అందుకే ఇప్పుడు త్వ‌ర‌లో ఆ నిర్మాత‌ను పెళ్లి చేసుకోబోతుంద‌ని కొన్ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ సృష్టిస్తున్నాయి. ఈ వార్త‌ల‌పై మాత్రం శ్రీ‌రెడ్డి ఇంకా స్పందించ‌లేదు. శ్రీ‌రెడ్డి పెళ్లి చేసుకోబోయే నిర్మాత ఎవర‌బ్బా అని సోస‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.


You may also like