Home » గుజరాత్ టైటాన్స్ కు షాక్!రూ.4 కోట్ల ఆటగాడు దూరం!

గుజరాత్ టైటాన్స్ కు షాక్!రూ.4 కోట్ల ఆటగాడు దూరం!

by Bunty
Ad

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే,  ఐపీఎల్ 2023 సీజన్ కు ముందు గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ తగిలింది.

Advertisement

ఐర్లాండ్ పెసర్ జోష్ లిటిల్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు దూరం అయ్యే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్ లో కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో లిటిల్ ను రూ.4.4 కోట్ల భారీ ధరకు గుజరాత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న లిటిల్ మోకాలి గాయం బారినపడ్డాడు. ఈ క్రమంలో పిఎస్ఎల్ మొత్తానికి దూరమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

 

ఈ నేపథ్యంలో అతడు మార్చిలో బంగ్లాదేశ్ తో జరిగే వన్డే, టి20 సిరీస్ తో పాటు ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్-2022లో లిటిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అదేవిధంగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో లిటిల్ కూడా రాణించాడు.

READ  ALSO : ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!

Visitors Are Also Reading