Home » శోభ‌న్ బాబు జ‌య‌ల‌లిత ప్రేమించుకున్నారా..? ఆయ‌న డైరీలో ఏం రాశారు..?

శోభ‌న్ బాబు జ‌య‌ల‌లిత ప్రేమించుకున్నారా..? ఆయ‌న డైరీలో ఏం రాశారు..?

by AJAY
Ad

టాలీవుడ్ లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి శోభ‌న్ బాబు అభిమానుల‌ను సంపాదించుకున్నారు. టాలీవుడ్ అంద‌గాడిగా సోగ్గాడిగా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. అందం మాత్రమే కాకుండా త‌నదైన న‌ట‌న‌తో శోభ‌న్ బాబు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. త‌న‌ను హీరోగానే ప్రేక్ష‌కులు గుర్తుపెట్టుకోవాల‌ని య‌వ్వ‌న వ‌య‌సు దాట‌గానే సినిమాల‌కు కూడా శోభ‌న్ బాబు గుడ్ బై చెప్పారు. తెలుగు తో పాటూ శోభన్ బాబు త‌మిళ ఇండ‌స్ట్రీలోనూ రానించారు. అయితే అప్ప‌ట్లో జ‌య‌లలిత శోభ‌న్ బాబు ప్రేమ‌లో ఉన్నారంటూ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి.

Also Read:  సమంత హీరోయిన్ కాకముందు ఈ జాబ్ చేసేదా.. ఆమె జీతం ఎంతో తెలిస్తే షాకే..?

Advertisement

జ‌య‌లలిత శోభ‌న్ బాబు హీరో హీరోయిన్ లుగా డాక్ట‌ర్ బాబు అనే సినిమా వ‌చ్చింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఒకే ఒక్క సినిమా ఇది. కాగా ఈ సినిమా షూటింగ్ కు కొన్ని రోజుల ముందు జ‌య‌లలిత త‌ల్లి మ‌ర‌ణించారట‌. ఆ త‌ర‌వాత జ‌య‌ల‌లిత త‌న త‌ల్లిని శోభ‌న్ బాబులో చూసుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని శోభ‌న్ బాబు స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. డాక్ట‌ర్ బాబు సినిమా షూటింగ్ ఊటీలో జ‌ర‌గ‌గా శోభ‌న్ బాబు జ‌యల‌లిత గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను త‌న డైరీలో రాసుకున్నారు.

Advertisement

Also Read:   బావ బావమరిదిగా మారబోతున్న ఎన్టీఆర్ – సాయి ధరమ్ తేజ్..!!

బ‌రువైన నా మ‌న‌సును నీ జోకుల‌తో తేలిక చేశావు..ప్ర‌పంచం అంతా ఇప్పుడు నిశ్చ‌లంగా క‌నిపిస్తోంది. అంద‌రితో మాట్లాడాల‌ని క‌లిసి ఉండాల‌ని అనిపిస్తుంద‌ని జ‌య‌ల‌లిత త‌న‌తో చెప్పిన‌ట్టు శోభ‌న్ బాబు త‌న డైరీలో రాసుకున్నారు. అంతే కాకుండా నా త‌ల్లి మ‌ర‌ణించి సంవత్స‌రం కూడా కాలేదు ఎన్నో సంవత్స‌రాలు అయిన‌ట్టు అనిపిస్తుంది. నా అనుక‌న్న‌వాళ్లు న‌న్ను మోసం చేశారు.

బంధువులు డ‌బ్బు కోస‌మే ఉన్నారు. ఎవరిని న‌మ్మాలా ఎవ‌రిని న‌మ్మొద్దొ తెలియ‌డం లేదు. ఇలాంటి ఎన్నో బాధ‌లు మీరు వ‌చ్చాక విముక్తి క‌లిగింది అంటూ జ‌య‌ల‌లిత త‌నతో చెప్పిన‌ట్టు శోభన్ బాబు డైరీలో రాసున్నారు. దాంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఉంది ప్రేమ కాద‌ని ఒక త‌ల్లి తండ్రి లాంటి అనుబంధం అని అర్థం అవుతుంది. కానీ వీరిద్ద‌రి సానిహిత్య వ‌ల్ల‌నే ప్రేమ‌లో ఉన్నారంటూ వార్త‌లు వినిపించాయి.

Also Read:   Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు త‌ప్ప‌వు

Visitors Are Also Reading