Home » సమంత హీరోయిన్ కాకముందు ఈ జాబ్ చేసేదా.. ఆమె జీతం ఎంతో తెలిస్తే షాకే..?

సమంత హీరోయిన్ కాకముందు ఈ జాబ్ చేసేదా.. ఆమె జీతం ఎంతో తెలిస్తే షాకే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత, ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఉంది. ఇప్పటికే తెలుగు తమిళ, ఇండస్ట్రీ లో నటించి సూపర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు ది ఫ్యామిలీ మాన్ -2 సిరీస్ తో పాన్ ఇండియా లెవల్లో పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా కొనసాగుతోంది. ఓవైపు షూటింగ్ తో పాటు గా మరోవైపు క్షణం తీరిక లేకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Advertisement

ఇంతటి స్టార్ డం తెచ్చుకోవడానికి సమంత చాలా కష్టపడింది. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ టాప్ హీరోయిన్ అయిందని చెప్పవచ్చు. మరి అలాంటి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ కాకముందు ఏ ఉద్యోగం చేసిందో తెలుసా? అలాగే ఆమె జీతం ఎంతో తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు.. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.. సమంత ఒక ఇంటర్వ్యూలో తను సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందో చెప్పింది.. ఆమె స్కూల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద హోటల్లో హోస్టెస్ గా పని చేశానని చెప్పుకొచ్చింది.

Advertisement

రోజుకు 8 గంటల పాటు షిఫ్టుల్లో పని చేశానని.. దీనికి వారు 500 రూపాయలు ఇచ్చేవారని వెల్లడించింది. ఆమె ఉద్యోగం చేసే సమయంలో పదో తరగతి చదువుతోంది. దీని తర్వాత ఏం మాయ చేసావే అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కథానాయికల్లో సమంతా కూడా ఒకరిగా ఉన్నారని చెప్పవచ్చు.

ALSO READ;

Visitors Are Also Reading