Home » బావ బావమరిదిగా మారబోతున్న ఎన్టీఆర్ – సాయి ధరమ్ తేజ్..!!

బావ బావమరిదిగా మారబోతున్న ఎన్టీఆర్ – సాయి ధరమ్ తేజ్..!!

by Sravanthi

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇందులో మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా సుప్రీమ్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి ఈ యంగ్ హీరో తాజాగా సపోర్టింగ్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్నటువంటి మూవీస్ వినోదాయ సితం అనే చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆయన ఈ షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వడం లో కాస్త ఇబ్బందిగా మారుతుందని తెలుస్తోంది. ఈ కారణం వల్లే సాయి ధరంతేజ్ మరొక సినిమాకు ఒప్పుకోలేదట. ఈ విధంగా పవన్ కళ్యాణ్ డేట్ ల కారణంగా సినిమా ఆలస్యం అవుతుండడంతో సాయి ధరమ్ తేజ్ మరో సినిమాలో కూడా గెస్ట్ రోల్ పాత్రను చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

దీంతో పాటు కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్నటువంటి మరో సినిమాలో కూడా సాయి ధరమ్ తేజ్, ఎన్టీఆర్ బావా బావ బావమరుదుల పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ కు సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న పాత్ర చాలా కీలకమైంది. ఇందులో ఆమెను ప్రేమించే పాత్రలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నట్టు సమాచారం. ఈ స్టొరీ మీదే సినిమా మొత్తం ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఇందులో సాయి ధరమ్ తేజ్ నిజంగానే నటిస్తున్నాడా లేదా అనే విషయం మాత్రం చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే గాని బయటకు వచ్చే పరిస్థితి లేదు.

ALSO READ;

Visitors Are Also Reading