Home » Hero Shivaji: ఉదయ్ కిరణ్ నుంచి ప్రభు దేవా వరకు శివాజీ ఇంతమందికి డబ్బింగ్ చెప్పారని తెలుసా..?

Hero Shivaji: ఉదయ్ కిరణ్ నుంచి ప్రభు దేవా వరకు శివాజీ ఇంతమందికి డబ్బింగ్ చెప్పారని తెలుసా..?

by Sravya
Published: Last Updated on
Ad

Hero Shivaji: చాలా సినిమాలలో ఒక హీరో లేదంటే ఎవరైనా పాత్రలకి ఎవరెవరో డబ్బింగ్ చెప్తూ ఉంటారు ఇటువంటివి చాలాసార్లు మనం చూసాము. నిజానికి మనం హీరోల గొంతులో నుండి వచ్చే డైలాగ్ లు ని మాత్రమే వింటూ ఉంటాం కానీ ఆ వాయిస్ ఎవరిది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోము. తెరమీద కనిపించే పేస్ కి ఉన్న వాల్యూ ఆ పేస్ కి డబ్బింగ్ చెప్పిన వ్యక్తికి ఇవ్వరు. అతను కేవలం వినిపిస్తారు అందుకే ఆ డబ్బింగ్ చెప్పిన వ్యక్తి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది నటీనటులకి పెద్ద పెద్ద హీరోలు సైతం డబ్బింగ్ చెప్తూ ఉంటారు. అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.

udaykiran

Advertisement

 

ఉదాహరణకి నటి సరితని తీసుకున్నట్లయితే సోనాలి బింద్రే, సౌందర్య ఇలా చాలామంది టాప్ హీరోయిన్లకి ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు. ఇక ఇది ఇలా ఉంటే హీరోలలో శివాజీ సైతం ఎంతోమంది నటులకి డబ్బింగ్ చెప్పారు. సాయికుమార్ అమితాబచ్చన్ నుండి రాజశేఖర్ వరకు చాలా మందికి డబ్బింగ్ చెప్పారు. శివాజీ డబ్బింగ్ చెప్పిన కొన్ని వాయిస్ లు మనం గుర్తుపట్టి ఉండము. కానీ ఈసారి మీరు చూస్తే కచ్చితంగా గుర్తుపట్టగలరు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కన్నా హీరోగా ఫేమస్ అయ్యారు శివాజీ. తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి వెళ్ళిన తర్వాత మరోసారి అందరికంట పడ్డారు. బిగ్బాస్ తర్వాత డబ్బింగ్ చేసిన పాత్రని కూడా చాలామంది గుర్తుపెట్టుకుని మరీ చూస్తున్నారు.

Also read:

Advertisement

దిల్ సినిమాలో నితిన్ కి శివాజీ డబ్బింగ్ చెప్పారు. మొదట్లో నితిన్ కి చాలా నత్తి ఉండేది ఇప్పుడైతే అది కవర్ అయింది, కానీ మొదట్లో అన్ని పాత్రలకి శివాజీ డబ్బింగ్ చెప్పారు జయం సినిమాలో కూడా నితిన్ కి శివాజీ డబ్బింగ్ చెప్పారు. ప్రభుదేవా కి కూడా అందరూ దొంగలే సినిమాకి శివాజీ డబ్బింగ్ చెప్పారు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాకి యశోసాగర్ కి కూడా డబ్బింగ్ చెప్పారు. శివాజీ, ఆర్యన్ రాజేష్ సొంతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్యన్ రాజేష్ కి కూడా శివాజీ డబ్బింగ్ చెప్పారు. విజయ్ సేతుపతి నటించిన పిజ్జా సినిమాకి తెలుగులో శివాజీ డబ్బింగ్ చెప్పారు. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కి చిత్రం సినిమాకి డబ్బింగ్ చెప్పారు శివాజీ. ఇలా శివాజీ ఈ హీరోల అందరికీ కూడా డబ్బింగ్ చెప్పారు కానీ చాలామందికి ఈ విషయం తెలీదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading