Home » Avasarala Srinivas: మహానటి సినిమాకు కీర్తి సురేష్ కరెక్ట్ కాదు..!

Avasarala Srinivas: మహానటి సినిమాకు కీర్తి సురేష్ కరెక్ట్ కాదు..!

by Sravya
Ad

Avasarala Srinivas: ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీల గురించి లేదంటే ఇతర రంగాల్లో ఎంతో మంది ప్రఖ్యాతలు సంపాదించిన వారి బయోపిక్ ని సర్వసాధారణంగా ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తూ ఉంటారు. ఎన్నో బయోపిక్ లు ఇప్పటికే వచ్చాయి వాటిని మనం చూసాం కూడా. సినీ ఇండస్ట్రీలో నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి దివంగత సీనియర్ నటి సావిత్రి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అలనాటి నటుల లో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళలో సావిత్రి ముందుంటారు. ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న సావిత్రి బయోపిక్ సినిమా గా మహానటి ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాని అందరికీ ఎంతో అద్భుతంగా చూపించారు.

Advertisement

మహానటి సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన విషయం తెలిసిందే ఈ పాత్రలో ఒదిగిపోయి ఈమె ఎంతో అద్భుతంగా నటించారు. సావిత్రి పాత్రలో అద్భుతమైన నటనని కనబరిచినందుకుగాను కీర్తి సురేష్ కి ఇంకా ఉత్తమ జాతీయ నటి అవార్డు కూడా వచ్చింది తాజాగా నటుడు అవసరాల శ్రీనివాస్ మహానటి సినిమా గురించి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తాను ఎల్బీ శ్రీరామ్ పాత్రలో నటించారు. అశ్విన్ అడగడంతో కాదని లేక వెంటనే పాత్రలో నటించాలని అన్నారు.

Advertisement

Also read:

సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్ అని అన్నారు కీర్తి సురేష్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తారు సావిత్రి గారి పాత్రలో నటించగలరా ఆమెలా హావభావాలు పలికించగలరానని సందేహాలు వ్యక్తమయ్యాయి. కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో తప్పుగా ఆలోచించారని కీర్తి సురేష్ సావిత్రి గారి పాత్రకి పర్ఫెక్ట్ ఛాయిస్ అని నాకు అర్థమైందని అవసరాల శ్రీనివాస్ అన్నారు. అవసరాల శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముందు కీర్తి సురేష్ ని తప్పుగా పెట్టారేమో అని భావించాను కానీ నేను అనుకున్నది తప్పు అని అవసరాల శ్రీనివాస్ చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading