Home » Jr NTR : నేను చనిపోయిన రోజు.. నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూస్తా..!

Jr NTR : నేను చనిపోయిన రోజు.. నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూస్తా..!

by Sravya
Ad

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి నుండో సినిమాలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తన రేంజ్ ని మరింత పెంచుకున్నారు ఎంతోమంది అభిమానుల్ని కూడా సంపాదించుకున్నారు. పుట్టిన ప్రతి ఒక మనిషికి కూడా ఏదో ఒక రోజు చావు ఉంటుంది. ఎవరు ఎప్పుడు చనిపోతామనేది ఎవరు కూడా చెప్పలేము. చనిపోయే రోజు నేను ఇంకా చావకుండా ఉంటే బాగుంటుంది లేదంటే నేను చూడాల్సిన జీవితం ఇంకా ఉంది అని చాలామంది బాధపడకుండా వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటారు.

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రపంచాన్ని ఎంతవరకు చూడాలనుకుంటున్నారో అంతవరకు చూసే తీరుతానని అన్నారు పైగా తను చనిపోయే రోజు ఏ ఒక్కటి చూడలేదు అన్న బాధతో చనిపోకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోయారట తన అన్నయ్య చనిపోయిన రోజు ఈ విషయాన్ని ఎన్టీఆర్ అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు తన అన్నయ్య చనిపోయాడని ఎవరికి తెలియదు తను చేయాల్సిన పనులు చూడాల్సిన జీవితం ఎంతో ఉండిపోయింది అయినా కూడా దేవుడు అర్దాయుష్షు తో తీసుకువెళ్లిపోయారు అలా వెళ్ళిపోతానని ఎవరైనా ఊహిస్తారా కానీ జరిగిపోతుంది జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు అలా జరిగిపోబోతున్న దాని గురించి మార్చలేము కనుక చేయాల్సిన పనులన్నీ కూడా ముందే చేసేయాలి అని ఎన్టీఆర్ అన్నారు.

Also read:

Advertisement

పిల్లల భవిష్యత్తుకు సరిపడా అన్ని సెట్ చేయాలి భార్య కూడా మనం లేని రోజు బాధపడకుండా ఉండాలి అని ఎన్టీఆర్ అన్నారు. పిల్లలు ఏమైపోతారు అని దిగులు ఆమెకి అసలు ఉండకూడదు. మనం జాగ్రత్తగా అన్నీ సెటిల్ చేసి వెళ్ళిపోతే తర్వాత వాళ్ళు బాగుంటారు అదే మనకి చాలు అని ఎన్టీఆర్ అన్నారు. ఎవరి చేతి కిందకి వెళ్ళకుండా ఉండాలి. అయ్యో మా నాన్న ఉండి ఉంటే ఈరోజు మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు అని బాధపడకూడదు అని ఎన్టీఆర్ చెప్పారు. అందుకోసం ఏదైతే చేయాలో అది చేసేయాలి అలా చేయకుండా వెళ్ళిపోయిన రోజు చచ్చినా బతికిన ఒక్కటే అని ఎన్టీఆర్ అన్నారు భవిష్యత్తు గురించి అన్ని జాగ్రత్తగా ఇప్పుడే చూసుకోండి ఇప్పటినుండి ఏదైనా చేయకపోతే ఇకపై మొదలుపెట్టండి మీరు లేని రోజు మీ కుటుంబం రోడ్డును పడకుండా ఉండడానికి జాగ్రత్తలు ప్రతిదీ తీసుకోండి అని ఎన్టీఆర్ అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading