Home » Allu Arjun : ఆంధ్రాలో మల్టీప్లెక్స్ నిర్మించబోతున్న అల్లు అర్జున్.. ఎక్కడో తెలుసా..?

Allu Arjun : ఆంధ్రాలో మల్టీప్లెక్స్ నిర్మించబోతున్న అల్లు అర్జున్.. ఎక్కడో తెలుసా..?

by Sravya
Ad

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. పుష్ప టు సినిమా అయినా హిట్ అవుతుంది అని ప్రేక్షకులు అంటున్నారు. ముఖ్యంగా అల్లుఅర్జున్ ఫాన్స్ అయితే పుష్ప టు సినిమా కోసం ఎంత ఆసక్తి ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చాలామంది హీరోలు ప్రస్తుతం వ్యాపార రంగంలో కూడా దూసుకు వెళ్ళిపోతున్నారు. ఒకపక్క సినిమాలు ఇంకో పక్క వ్యాపారం చూసుకుంటూ భారీగా డబ్బులు వెనకేస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ చాలామంది హీరోలు బ్రాండ్లని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇలా రకరకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు.

Advertisement

కొంతమంది హీరోలు అయితే నిర్మాణరంగంలో దూసుకు వెళ్తున్నారు స్టూడియో థియేటర్ బిజినెస్లలో కూడా సక్సెస్ ని అందుకుంటున్నారు చాలామంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ వాళ్ళతో కలిసి హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ థియేటర్లని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు కూడా మల్టీప్లెక్స్ థియేటర్లో నిర్వహిస్తున్న విషయం మనకి తెలుసు. ఇక మాస్ మహారాజా రవితేజ త్వరలోనే మల్టీప్లెక్స్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also read:

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాదులో ఒక ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ రన్ చేస్తున్నారు త్వరలోనే ఇంకో మల్టీప్లెక్స్ ని ఆంధ్ర ప్రదేశ్ లో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఏషియన్ వాళ్ళతో కలిసి వైజాగ్ లో ఒక మల్టీప్లెక్స్ ని నిర్మించాలని ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం వైజాగ్ లో నిర్మిస్తున్న న్యూ ఆర్బిట్ మాల్ లో ఏషియన్ వారితో కలిసి అచ్చం హైదరాబాదులో ఉన్న విధంగా ఇక్కడ కూడా మల్టీప్లెక్స్ నిర్మించాలని ఆలోచనలో ఉన్నారు అల్లు అర్జున్. మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మాణం గురించి వస్తున్నటువంటి వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది ఈ వార్త మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading