Home » శేఖర్ కమ్ముల ప్లాన్ మామూలుగా లేదుగా.. మల్టీస్టారర్ గా మారిన ధనుష్ మూవీ..!

శేఖర్ కమ్ముల ప్లాన్ మామూలుగా లేదుగా.. మల్టీస్టారర్ గా మారిన ధనుష్ మూవీ..!

by Anji
Ad

టాలీవుడ్ ఫీల్ గుడ్ సినిమాలు అంటే.. ప్రస్తుత కాలంలో వెంటనే గుర్తుకొచ్చే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, నుంచి ఇటీవల వచ్చిన లవ్ స్టోరీ వరకు ఒక్కో సినిమాకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కమర్షియల్ హంగులకు దూరంగా ఉండే శేఖర్ కమ్ముల రియాలిటీని ప్రతిబింబించేలా సినిమాలను తెరకెక్కిస్తాడు. అందుకే ఈ దర్శకుడు సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి దర్శకుడు నుంచి లవ్ స్టోరీ సినిమా తరువాత ధనుష్ తో ఓ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాడు. 

Advertisement

దాదాపు రెండేళ్లపాటు స్క్రిప్ట్ ని రెడీ చేశాడు. మొదట  ధనుష్ హీరో అనుకొని స్టార్ట్ చేసిన స్క్రిప్ట్ తీరా.. చూస్తే అది మల్టీస్టారర్ స్టోరీ అయిందట. ధనుష్ పాత్ర కాకుండా.. వచ్చే పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని సమాచారం. థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే ఈ సినిమా కథను మార్చే పాత్ర అని తెలుస్తోంది. అందుకే స్క్రిప్ట్ రెడీ చేయడానికీ రెండేళ్ల సమయం తీసుకున్నాడట. అలాంటి పాత్రకు న్యాయం చేసే మరో హీరోను వెతికే పనిలో పడ్డ శేఖర్ కమ్ములకు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కథ చెప్పగానే నాగ్ ఫిధా అయిపోయినట్టు సమాచారం. 

Advertisement

అదేవిధంగా ధనుష్ కి జోడీ కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను సంప్రదింపులు జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే నాగార్జునకు జోడీగా ఎవరు ఉంటానేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. దీంతో పాటు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ ఫిక్స్ అయ్యాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 రీ రిలీజ్ అవుతున్న బాలకృష్ణ మరో క్లాసిక్ బ్లాక్ బస్టర్.. ఎప్పుడంటే ?

అదే నేను చేసిన పెద్ద మిస్టేక్.. వైరల్ అవుతున్న ఆమని కామెంట్స్.. అసలేం జరిగిందంటే?

ఆ ఒక్క కారణంతోనే లావణ్య త్రిపాఠి ఆ హీరోతో పెళ్లికి నో చెప్పిందా ?

 

Visitors Are Also Reading