Home » రీ రిలీజ్ అవుతున్న బాలకృష్ణ మరో క్లాసిక్ బ్లాక్ బస్టర్.. ఎప్పుడంటే ?

రీ రిలీజ్ అవుతున్న బాలకృష్ణ మరో క్లాసిక్ బ్లాక్ బస్టర్.. ఎప్పుడంటే ?

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. టాప్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు.. ఇంకా చెప్పాలంటే సీనియర్ స్టార్ హీరోల సినిమాలు కూడా ఇప్పుడు వరుసగా విడుదల చేస్తున్నారు. ఒక సినిమా తరువాత మరో సినిమా.. ఒక హీరో తరువాత మరో హీరో ఇలా క్యూ కడుతున్నారు. సీనియర్ హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ కాగా.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు కూడా రీ రిలీజ్ చేశారనే విషయం విధితమే. 

Advertisement

నందమూరి నటసింహం బాలయ్య కూడా ఈ లిస్ట్ లో ఎప్పుడో చేరిపోయాడు. ఆయన నటించిన చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు రీ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా బాలయ్య నటించిన మరో క్లాసిక్ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. బాలయ్య హీరోగా నటించిన జానపద చిత్రం భైరవద్వీపం. ఈ సినిమా అప్పట్లో ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. ప్రముఖ దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా 1994లో విడుదలై సంచలన విజయం సాధించింది.

Advertisement

ఇక ఈ  సినిమాలో బాలయ్య తన కెరీర్ లోనే ఉత్తమ నటన కనబరచడం విశేషం.  ఆ క్లాసిక్ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధమైంది. ఆగస్టు 5న భైరవ ద్వీపం మూవీ రీ రిలీజ్ చేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. కామన్ ఆడియన్స్ తో పాటు చిన్న పిల్లలకు కూడా ఎంతగానో నచ్చే ఈ మూవీ రీ రిలీజ్ లో ఎన్ని కలెక్షన్లు వసూలు చేస్తుందో వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 ఆ ఒక్క కారణంతోనే లావణ్య త్రిపాఠి ఆ హీరోతో పెళ్లికి నో చెప్పిందా ?

చివరి క్షణాల దాకా ఆ కండిషన్ ని బ్రేక్ చెయ్యని సూపర్ స్టార్ కృష్ణ.. విజయ నిర్మల పెట్టిన ఈ కండిషన్ ఏంటంటే?

Visitors Are Also Reading