Home » మెగా హీరోల కంటే ఆ హీరో అంటేనే ఇష్టమా..? ఉపాసన షాకింగ్ కామెంట్స్..!

మెగా హీరోల కంటే ఆ హీరో అంటేనే ఇష్టమా..? ఉపాసన షాకింగ్ కామెంట్స్..!

by Anji

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఎంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఎవరో ఒకరంటనే ప్రత్యేకంగా అభిమానం ఉంటుంది. అది ఎవరైనా సరే ఏ స్టార్ హీరోయిన్ అయినా, హీరో అయినా మనకంటూ ఒక ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ తప్పకుండా ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా సగానికి పైగా మెగా హీరోలు ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకి మాత్రం ఆ తెలుగులో హీరో అంటేనే ఇష్టమట. అంతేకాదు కొంతమంది మెగా హీరోలు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కాదని తనకు ఆయన అంటేనే ఇష్టమని కరాకండిగా చెప్పేసింది మెగా కోడలు ఉపాసన.


ఆయన ఎవరో కాదు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్. మొదటి నుంచి ఉపాసనకి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే విక్టరీ వెంకటేష్ నటనకు ఆమె బాగా కనెక్ట్ అయిపోయింది. అంతేకాదు ఇప్పటికీ ఆయన నటించిన సినిమాలను టీవీలో చూస్తూనే ఉంటుందట. మరీ ముఖ్యంగా వెంకటేష్ నటించిన జయం మనదేరా, కలిసుందాం రా వంటి సినిమాలు ఆమెకు బాగా ఇష్టమని అందుకే సమయం దొరికితే చాలా ప్రతిసారి ఆ పాత సినిమాలనే చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటుందట ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ విషయం తెలిసి మెగా అభిమానులు కూడా ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా మెగా హీరోలు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కాదని వెంకటేష్ నటన మాత్రమే నచ్చడం చాలా స్పెషల్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మొత్తానికి అయితే వెంకటేష్ నటనను ఆమె ఇష్టపడటం అటు వెంకటేష్ అభిమానులకి కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. మెగా కోడలుగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా కూడా మరింత పేరు దక్కించుకుంది. అంతేకాదు ఒక మంచి మనసున్న అమ్మాయిగా ఎంతోమంది ఆడవారికి, పిల్లలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. కరోనా సమయంలో సోషల్ మీడియాలో ఆరోగ్యం పై అవగాహన కల్పించిన ఈ ముద్దుగుమ్మ సమయం గడిపితే చాలు ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకొని తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది .ఎక్కువగా అనాధా ఆశ్రమాలను, వృద్ధాశ్రమాలను సందర్శిస్తూ వృద్ధులకు, మహిళలకు కావలసిన అన్ని వసతులను అందిస్తూ ఉంటుంది. అంతేకాదు గిరిజన మహిళల చేత ఒక ప్రత్యేకమైన పరిశ్రమను స్థాపించి వారికంటూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది ఉపాసన. ఏదేమైనా ఉపాసన లాంటి కోడలు దొరకడం నిజంగా మెగా ఫ్యామిలీ అదృష్టం అంటూ నిటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading