Telugu News » Blog » సుప్రియ సూలేతో థ‌రూర్ చిట్‌చాట్ పై మీమ్స్‌..!

సుప్రియ సూలేతో థ‌రూర్ చిట్‌చాట్ పై మీమ్స్‌..!

by Anji

లోక్ స‌భ కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ మ‌రొక‌సారి నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షించారు. ఫ‌రాగో అబ్దుల్లా అనే ట్విట‌ర్ యూజ‌ర్‌షేర్ చేసిన వీడియోలో బారామ‌తి ఎంపీ సుప్రియా సూలేతో థ‌రూర్ మాట్లాడుతున్న‌ట్టు క‌నిపించింది.


ముఖ్యంగా ట్విట‌ర్‌లో షేర్ చేసిన క్లిప్ లో ఫ‌రూక్ అబ్దుల్లా ప్ర‌సంగం స‌మ‌యంలో సుప్రియా సూలేతో మాట్లాడేందుకు శ‌శిథ‌రూర్ త‌న నియ‌మించ‌బ‌డిన కుర్చీపై వాటిన‌ట్టు క‌నిపించారు. మ‌రొక‌వైపు మైక్రో బ్లాగింగ్ సైట్‌లో షేర్ చేసిన క్లిప్‌లో సూలేతో మాట్లాడేందుకు థ‌రూర్ త‌న నిర్దేశిత కుర్చిపై వాలిన‌ట్టు క‌నిపించారు.

ఆ స‌మ‌యంలో సీనియ‌ర్‌నేత, జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూఖ్ అబ్దుల్లా ప్ర‌సంగిస్తూ క‌నిపించారు. అయితే ఒరిజిన‌ల్ ఆడియోకు బ‌దులుగా, అల్లుఅర్జున్ న‌టించిన పుష్ప చిత్రంలోని చార్ట్‌బ‌స్ట‌ర్ ట్రాక్ శ్రీ‌వల్లిని వీడియోకు జోడించారు.

 

ర‌ష్యా ఉక్రెయిన్ వార్ అంశంపై పార్ల‌మెంట్‌లో చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎన్‌.కే. ప్రేమ‌చంద్ర‌న్ ఉన్న స‌మ‌యంలో ఈ వీడియో చిత్రీక‌రించారు. థ‌రూర్ చిరున‌వ్వుతో కూడి ముఖం.. సూలేఏ వైపు వాలి ఉండ‌డంతో ప్ర‌తిచ‌ర్య‌ల‌కు దారి తీసింది. ఈ వీడియోకు సంబంధించి నెటిజ‌న్లు కొన్ని హాస్య‌స్ప‌ద‌మైన మీమ్స్ కూడా చేసారు.

Also Read :  టాటా సూప‌ర్ యాప్ విడుద‌ల‌.. టాటా న్యూ గురించి తెలుసా..?

You may also like