Home » టాటా సూప‌ర్ యాప్ విడుద‌ల‌.. టాటా న్యూ గురించి తెలుసా..?

టాటా సూప‌ర్ యాప్ విడుద‌ల‌.. టాటా న్యూ గురించి తెలుసా..?

by Anji
Ad

టాటా గ్రూప్ నుంచి మ‌రొక కొత్త స‌ర్వీస్ వ‌చ్చేసింది. టాటా గ్రూప్ ఆల్ ఇన్ వన్ సూప‌ర్ యాప్‌ను విడుద‌ల చేసింది. టాటా న్యూ పేరుతో ఈ ప్లాట్ ఫామ్ ను ప‌రిచ‌యం చేసింది. టాటా గ్రూప్ చైర్ ప‌ర్స‌న్ ఎన్‌.చంద్ర‌శేఖ‌రన్ ఈ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్క‌రించారు. ఇప్ప‌టివ‌ర‌కు టాటా గ్రూప్ ఉద్యోగుల‌కు ఇన్విటేష‌న్ ఉన్న వారికి మాత్ర‌మే ఈ యాప్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు యూజ‌ర్లు అంద‌రికీ ఈ యాప్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇవాళ కొత్త రోజు టాటా డిజిట‌ల్ టాటా కుటుంబంలోని అతి పిన్న వ‌య‌స్కుడు. టాటా న్యూ మీ ముందుకు వ‌చ్చేసింద‌ని టాటా గ్రూప్ చైర్ ప‌ర్స‌న్ టాటా న్యూ ఆవిష్క‌ర‌ణ అన్నారు.

Advertisement

ఇప్ప‌టికే అనేక బ్రాండ్స్‌ను భార‌తీయుల‌కు ప‌రిచ‌యం చేసిన టాటా గ్రూప్ ఇప్పుడు టాటా న్యూ యాప్ ద్వారా సేవ‌ల్ని అందించేందుకు వ‌చ్చింది. టాటా సూప‌ర్ యాప్ రూప‌క‌ల్పన‌కు 2020లోనే అడుగులు ప‌డ్డాయి. ఏడాదిన్న‌ర కృషి త‌రువాత ఈ యాప్‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది టాటా గ్రూప్‌. భార‌తీయుల జీవితాల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ యాప్ తీసుకొచ్చిన‌ట్టు టాటా గ్రూప్ చెబుతోంది.

Also Read :  పుష్ప : ద రూల్‌లో కూడా స‌మంత ఐట‌మ్ సాంగ్‌..!

Advertisement

టాటా సూప‌ర్ యాప్ అయిన టాటా న్యూ ప్ర‌త్యేక‌త‌లు చూస్తే యాప్ చూడ‌డానికి బ్లాక్ బ్యాగ్రౌండ్‌తో ప్రీమియం లుక్ క‌నిపిస్తోంది. ఇందులో న్యూకాయిన్స్ పేరుతో రివార్డు సెక్ష‌న్ ఉంది. క‌స్ట‌మ‌ర్లు న్యూకాయిన్స్‌ను ఈ యాప్‌తో పాటు ఫిజిక‌ల్ స్టోర్స్‌లో కూడా క‌లెక్ట్ చేయ‌చ్చు. టాటా న్యూ యూజ‌ర్లు టాటా క్లిక్, బిగ్ బాస్కెట్, ఎయిర్ ఏసియా ఇండియా, క్రోమా లాంటి టాటా బ్రాండ్స్‌ని ఈ యాప్ ద్వారా యాక్సెస్ చేయ‌వ‌చ్చు.


టాటా న్యూ యాప్‌లో గ్రాస‌రిస్, ఎల‌క్ట్రానిక్స్‌, ఫుడ్ డెలివ‌రీ, హోట‌ల్ బుకింగ్స్, ప్లైట్ బుకింగ్స్ లాంటి సేవ‌ల‌న్నీ ల‌భిస్తాయి. వేర్వేరు సేవ‌ల‌కు వేర్వేరు యాప్స్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా ఒకే యాప్‌లో అన్ని సేవ‌ల్ని పొంద‌వ‌చ్చు. టాటా పే ద్వారా పేమెంట్స్‌చేయ‌వ‌చ్చు. మొబైల్ రీఛార్జ్ ద‌గ్గ‌ర నుంచి డీటీహెచ్ సేవ‌ల వ‌ర‌కు అన్ని ర‌కాల పేమెంట్స్ చేయ‌వ‌చ్చు. టాటా న్యూ యాప్‌లో బ‌య్ నౌ లెట‌ర్‌, డిజిట‌ల్ గోల్డ్‌, ఇన్స్యూరెన్స్‌, ప‌ర్స‌న‌ల్ లాంటి సేవ‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. బిగ్ బాస్కెట్ నుంచి స‌రుకుల‌ను, 1 ఎంజీ నుంచి మందుల‌ను తెప్పించుకోవ‌చ్చు. టాటా న్యూ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే డౌన్ లోడ్ చేసుకోండి.

Also Read :  ఎన్టీఆర్ నాగ‌శౌర్య బంధువులా…షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టిన హీరో త‌ల్లి..!

Visitors Are Also Reading