Telugu News » Blog » రమాప్రభకి ఎందుకు 60 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ? శరత్ బాబు కి రమా ప్రభకి గొడవ ఏంటి ?

రమాప్రభకి ఎందుకు 60 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ? శరత్ బాబు కి రమా ప్రభకి గొడవ ఏంటి ?

by Bunty
Ads

టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూసారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితమే తుది శ్వాసవిడిచారు. శ్రీకాకుళం లోని ఆముదాలవలసలో జూలై 31, 1951లో జన్మించిన ఆయన… 1973లో ‘రామరాజ్యం’ సినిమాలో మొదట హీరోగా నటించారు. మొత్తం 200కు పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు 1981,1988,1989 సంవత్సరాలలో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా, శరత్ బాబు రామరాజ్యం చిత్రం తర్వాత వచ్చిన కన్నెవయసు చిత్రంలో నటించారు.

Advertisement

ఆ తర్వాత పలు చిత్రాల్లో ప్రతి నాయకుడి పాత్రలో నటించారు. ప్రముఖ దర్శకులు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘చిలకమ్మ చెప్పింది’ మూవీ శరత్ బాబుకి మంచి పేరు తీసుకువచ్చింది. మూడుముళ్ల బంధం, సీతాకోకచిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్బాంధవుడు ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించారు శరత్ బాబు. ఆయన నటనతో కోట్లది మంది అభిమానం సంపాదించిన శరత్ బాబు ఇండస్ట్రీకి దూరం అయ్యారన్న విషయం తెలుసుకొని ఇండస్ట్రీ ప్రముఖులే కాదు… అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

ఇది ఇలా ఉండగా… శరత్ బాబు ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. శరత్ బాబు పై… గతంలో రమాప్రభ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. శరత్ బాబు తన ఆస్తులను కాజేసాడని… ఆయన వ్యక్తిత్వం లేని మనిషిని ఆమె పేర్కొంది. అయితే ఆ విషయాల గురించి శరత్ బాబు మాట్లాడుతూ… రమ ప్రభకు ఏకంగా 60 కోట్ల ఆస్తి ఇచ్చానని వెల్లడించారు. మీరంతా నన్ను విమర్శిస్తున్నారు… కానీ నేను అప్పట్లో నా ఆస్తి అమ్మి రమాప్రభ పేరు మీద ఒక ప్రాపర్టీ, ఆమె తమ్ముడు పేరు మీద మరొకటి… అలాగే ఇద్దరు పేరుమీద మరొక ప్రాపర్టీ కొనిచ్చానని శరత్ బాబు తెలిపారు. రమాప్రభకు నాకు తెలిసిన బంధువు ఆమె తమ్ముడు మాత్రమేనని… నా కారు డ్రైవ్ చేస్తూ నాతో తిరిగేవాడిని చెప్పుకొచ్చారు శరత్ బాబు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

సమంత లాగే బరితెగించిన రష్మిక?

Rashi Khanna : ఆ భయంకరమైన వ్యాధితో నరకం అనుభవిస్తున్న రాశిఖన్నా…!

Advertisement

BREAKING: నటుడు శరత్ బాబు కన్నుమూత

You may also like