టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో చాలామంది వివిధ కారణాలవల్ల మరణించారు. ఇక నిన్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజకుమార్ మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వార్త మరువక ముందే మరో విషాదం టాలీవుడ్ చిత్రపరచడంలో చోటుచేసుకుంది.
Advertisement
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మరణించారు. సీనియర్ నటుడు శరత్ బాబు (73) కన్నుమూశారు. కాసేపటికి క్రితమే హైదరాబాద్ మహానగరంలోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు నటుడు శరత్ బాబు. ఏప్రిల్ 20 నుంచి AIG హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న శరత్ బాబు.. మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా డ్యానేజ్ అవ్వడంతో మృతి చెందారు.
Advertisement
Advertisement
1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించారి శరత్ బాబు. టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1973లో రామరాజ్యం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. హీరోగా, విలన్‌గా, సహా నటుడిగా అనేక పాత్రలు పోషించారు శరత్ బాబు. ఇక నటుడు శరత్ బాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రేపు హైదరాబాద్ మహాప్రస్థానంలో శరత్ బాబు అంత్యక్రియలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది.