Home » మాకు ప్రపంచ కప్ వద్దు.. ఇండియాను కూడా గెలవనివ్వం..!

మాకు ప్రపంచ కప్ వద్దు.. ఇండియాను కూడా గెలవనివ్వం..!

by Azhar
Ad

ఇండియా, బంగ్లాదేశ్ మధ్య రేపు టీ20 ప్రపంచ కప్ 2022 సూపర్ 12లో భాగంగా మ్యాచ్ అనేది జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ రెండు దేశాలకు చాలా కీలకమైన మ్యాచ్. ప్రస్తుతం 4 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్న బంగ్లాదేశ్, ఇండియా జట్లలో రేపు ఏ జట్టు మ్యాచ్ గెలిస్తే ఆ జట్టే సెమీస్ రేస్ లో ముందుకు వెళ్తుంది.

Advertisement

అయితే ఈ మ్యాచ్ కు ముందు తాజాగా మీడియాతో మాట్లాడిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హాసన్ తన కామెంట్స్ తో అందరిని షాక్ కు గురి చేసాడు అనే చెప్పాలి. ఏ కెప్టెన్ ప్లేయర్ కూడా ఇలాంటి కామెంట్స్ చేయలేరు. అయితే షకీబ్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచ కప్ టైటిల్ ఫెవరెట్ గా భారత జట్టు ఉంది. కానీ మేము టైటిల్ ఫెవరెట్స్ కాదు.

Advertisement

ఇండియా ఆస్ట్రేలియాకు టైటిల్ కోసం వచ్చింది. అయితే రేపటి మ్యాచ్ లో మేము ఇండియాను ఓడించి వారిని వెన్నకి పంపిస్తాం. మేము టైటిల్ కోసం ఆస్ట్రేలియాకు రాలేదు. కానీ దాని కోసం వచ్చిన ఇండియాను ఓడించి ఆ జట్టును నిరుత్సహపరుస్తాం అని పేర్కొన్నాడు. అయితే షకీబ్ చేసిన ఈ కామెంట్స్ అనేవి విన్న తర్వాత సగటు క్రికెట్ అభిమై ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. షకీబ్ కామెంట్స్ ను తప్పు బడుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

బాబర్ కెప్టెన్ గా ఉంటె పాకిస్థాన్ పతనం పక్కా..!

వికెట్ల ముందు బంతి అందుకున్న కీపర్.. పిలిచి మరి బ్యాటింగ్ చేయించిన అంపైర్..!

Visitors Are Also Reading