Home » వికెట్ల ముందు బంతి అందుకున్న కీపర్.. పిలిచి మరి బ్యాటింగ్ చేయించిన అంపైర్..!

వికెట్ల ముందు బంతి అందుకున్న కీపర్.. పిలిచి మరి బ్యాటింగ్ చేయించిన అంపైర్..!

by Azhar
Ad

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో రోజు ఏదో ఒక్క ఆసక్తికర సంఘటన జరుగుతూనే ఉంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతుంది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. ఆ తర్వాత జింబాబ్వేతో పాక్ నాటిన మ్యాచ్ కూడా ఇలానే సాగింది. అయితే ఈరోజు బంగ్లాదేశ్ అలాగే జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఓ ఘటన అనేది చోటు చేసుకుంది.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో మొదట తడబడిన తర్వాత జింబాబ్వే కుదురుకుని లక్ష్యం వైపు అడుగులు వేసింది. ఆ తరుణంలో జింబాబ్వేకు చివరి ఓవర్ లో 16 పగలు కావాల్సి ఉండగా.. ఆఖరి బంతికి 5 పరుగులు విజయం కోసం అవసరం అయ్యాయి. ఆ సమయంలో బంగ్లా బౌలర్ మొసద్దెక్ హుస్సేన్ వేసిన ఆఖరి బంతిని జింబాబ్వే బ్యాటర్ మిస్ చేయడంతో మ్యాచ్ ముగిసింది అని అందరూ అనుకున్నారు. జింబాబ్వే బ్యాటర్లు పెవిలియన్ కూడా ప్రయాణం మొదలు పెట్టారు.

Advertisement

కానీ మ్యాచ్ లో అక్కడే ట్విస్ట్ అనేది వచ్చింది. జింబాబ్వే బ్యాటర్ మిస్ చేసిన ఆ ఆఖరి బంతిని బంగ్లా వికెట్ కీపర్.. వికెట్ల కంటే ముందే అందుకున్నాడు. ఇక క్రికెయ్ నియంల ప్రకారం కీపర్.. బంతిని వికెట్లు దాటినా తర్వాతే అందుకోవాలి. లేదంటే అది నో బాల్ గా పరిగణిస్తారు. ఇక ఇక్కడ కూడా అంపైర్లు అలాగే చేసి.. వెళ్లిపోతున్నా జింబాబ్వే బ్యాటర్లను పిలిచి మరి మళ్ళీ ఆగారి బంతి బ్యాటింగ్ చేయించారు. కానీ ఫలితం అనేది లేదు. జింబాబ్వే బ్యాటర్ ఆ బంతిని కూడా మిస్ చేయడంతో మూడు పరుగుల తేడాతో బంగ్లా విజయం అనేది అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ నో బాల్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ ఇన్నింగ్స్ క్రికెట్ భగవద్గీత..!

బాబర్ కెప్టెన్ గా ఉంటె పాకిస్థాన్ పతనం పక్కా..!

Visitors Are Also Reading