Home » మొత్తానికి ఇండియానే గొప్ప అని తెలుసుకున్న ఆఫ్రిది…!

మొత్తానికి ఇండియానే గొప్ప అని తెలుసుకున్న ఆఫ్రిది…!

by Azhar
Ad

ఇండియా – పాకిస్థాన్ విషయంలో రోజు ఏదో ఒక్క చర్చ ఉంటూనే ఉంటుంది. అది రాజకీయ పరంగానా.. లేక క్రీడల పరంగానా అనేది మాత్రం చెప్పలేం. అయితే ఆటల్లో ఈ రెండు జట్లు ఎదురుపడితే మాత్రం ఆ హిట్ మాములుగా ఉండదు. ఇక పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు అయితే ఇండియా గురించి ఏదో ఒక కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అందులో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఎప్పుడు ముందువరుసలో ఉంటాడు. ఇండియాను తక్కువ చేసి మాట్లాడటం ఆఫ్రిదికి అలవాటు. అలా చేసి చాల సమయాల్లో విమర్శలో చిక్కుకున్నాడు.

Advertisement

అయితే తాజాగా మరోసారి ఇండియా గురించి ఆఫ్రిది మాట్లాడాడు. ఆ మాటలను చూస్తూనే ఆఫ్రిదికి బుద్ధి వచ్చిందని అర్ధం అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము గొప్ప అని చెప్పుకునే ఆఫ్రిది మొత్తానికి ఇండియానే గొప్ప అని తెలుసుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే.. ఆఫ్రిది మాట్లాడుతూ… క్రికెట్ అనేది ఇప్పుడు దబ్బబు చుట్టూ తిరుగుతుంది. మొత్తం మార్కెటింగ్ పైనే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇండియాలోనే క్రికెట్ కు మంచి మార్కెట్ ఉంది. అందకే వారు ఐపీఎల్ ను ఇంకా విస్తరించాలని అనుకుంటున్నారు.

Advertisement

అందుకే ఐసీసీ షెడ్యూల్ లోనే ఈ ఐపీఎల్ ను చేర్చాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. అది జరుగుతుంది కూడా. ఎందుకంటే బీసీసీఐని ఆపడం ఎవరి వల్ల కాదు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెప్పినట్లు ఐపీఎల్ ను పొడిగిస్తే మాకు నష్టం జరుగుతుంది అనేది మాత్రం నిజం అని ఆఫ్రిది అన్నాడు. అయితే వచ్చే ఏడాది నుండి ఐపీఎల్ మ్యాచ్ ల సంఖ్య పెంచాలని బీసీసీఐ అనుకుంటుంది. కానీ అలా చేస్తే మిగితా జట్ల ముఖ్యమైన ఆటగాళ్లు మొత్తం అందులోనే ఉంటారు అని… దాని ప్రభావం ద్వైపాక్షిక సిరీస్ల పైన పడుతుంది అని పాకిస్థాన్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

సాహా ఎమోషనల్… ఇక నా కెరియర్ ముగిసిపోయింది..!

ఇండియా – పాక్ మ్యాచ్ పై వైరల్ అవుతున్న హర్భజన్ కామెంట్స్..!

Visitors Are Also Reading