Telugu News » Blog » ఇండియా – పాక్ మ్యాచ్ పై వైరల్ అవుతున్న హర్భజన్ కామెంట్స్..!

ఇండియా – పాక్ మ్యాచ్ పై వైరల్ అవుతున్న హర్భజన్ కామెంట్స్..!

by Manohar Reddy Mano
Ads

ఇండియా – పాకిస్థాన్ అనేవి చిరకాల ప్రత్యర్ధులు అనే విషయం చిన్న పిల్లవాడిని అడిగిన చెప్తాడు. అందుకే ఈ రెండు దేశాలు ఎక్కడ ఎదురు పడిన అది ఓ యుద్ధమే. ఏ ఆట అయిన సరే ఇండియా vs పాకిస్థాన్ అని ఉంటె దానికి విపరీతమైన క్రేజ్ అనేది ఉంటుంది. ఇక క్రికెట్ లో అయితే పదింతలు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లో ఈ రెండు జట్లు ఎదురుపడనున్నాయి.

Advertisement

అక్టోబర్ 23న ఈ టోర్నీలోని తమ మొదటి మ్యాచ్ లలోనే ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి. దాంతో ఇందులో ఎవరు గెలుస్తారు అనే విషయంలో హర్భజన్ సింగ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ తో హర్భజన్ మాట్లాడుతూ… ఈ ఏడాది ఇండియా – పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో నేను ఏమి మాట్లాడాను. గత ఏడాది ఇలానే ఇండియా గెలుస్తుంది అని చెప్పను. కానీ నా మాటలు తప్పుగా అయ్యాయి.

Advertisement

అందువల్ల ఈ ఏడాది ఎవరు విజయం సాధిస్తారు అనేది ఇప్పుడే చెప్పలేను అని హర్భజన్ అన్నాడు. అయితే గత ఏడాది ప్రపంచ కప్ కి ముందు ఇండియా – పాక్ మ్యాచ్ లో.. ఇండియా అతప్పకుండా గెలుస్తుంది అని.. అసలు పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఆడటం అనవసరం అని చెప్పాడు. కానీ తీరా చూస్తే పాకిస్థాన్ జట్టు 10 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించింది. దాంతో హర్భజన్ పై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. పాక్ అభిమానులు భజ్జిఓ ఆట ఆదుకునే విషయం తెలిసిందే.

Advertisement

ఇవి కూడా చదవండి :

పెళ్లి అయ్యి నెల కాకముందే.. పెళ్లిపై దీపక్ షాకింగ్ కామెంట్స్..!

బీసీసీఐకి డెడ్ లైన్ ప్రకటించిన ఐసీసీ…!

You may also like