బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బండ్ల గణేష్ నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగారు. గత కొద్ది కాలం నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసి ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు బండ్ల గణేష్. మరొకసారి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్ పై త్వరలోనే నిర్ణయం ఉంటుందని చెప్పారు.
Advertisement
నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా, రాజకీయాలు చేస్తానని పేర్కొన్నారు. బానిసత్వంతో కాకుండా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తానని ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కొత్త జోష్ ఇచ్చినట్టు ఉంది అని పేర్కొన్నారు బండ్ల గణేష్. “మీరు మా రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయిస్తే.. కర్ణాటక ప్రజలు రాష్ట్రాన్నే ఖాళీ చేయించారు” అంటూ సెటైరికల్ గా కామెంట్ చేశారు బండ్ల గణేష్. నాలుగు సంవత్సరాల కిందట నాటి ఒక క్రిమినల్ పరువు నష్టం కేసులు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునివ్వడం.. దానికి కారణంగా చూపిస్తూ ఎంపీగా ఆయనపై అర్హత వేటు వేశారు. ఇక ఆ తర్వాత రావాలి అధికారిక నివాసాన్ని కూడా కాల్ చేయించారు. దానినే ఉదాహరణగా పండ్ల గణేష్ సీట్ చేశారు.
Advertisement
మరోవైపు మదర్స్ డే సందర్భంగా తన తల్లితోపాటు.. తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని కొనియాడారు. కర్ణాటకలో డీకే శివకుమార్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారని.. ఆయనను సీఎం చేయాలని ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పెద్దలను రిక్వెస్ట్ చేశారు బండ్ల గణేష్. ఇదంతా చూస్తుంటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరు నెలల్లోనే తెలంగాణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే పండ్ల గణేష్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆయన సేవలను తెలంగాణ కాంగ్రెస్ ఎంత మేరకు ఉపయోగించుకుంటుందని ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.
మరి ముఖ్యమైన వార్తలు :
‘లియో’లో విజయ్ డబుల్ రోల్.. ఏయే పాత్రలో అంటే ?
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఆశ్చర్యకర విషయాన్ని చెప్పిన తల్లి అంజనాదేవి..!
ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. సలార్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!