Home » ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. సలార్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!

ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. సలార్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరోల్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దర్శకధీరుడు తెరకెక్కించిన  బాహుబలి మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. దేశవ్యాప్తంగా ప్రభాస్ కి అభిమానులు పెరిగిపోయారు. బాహుబలి సిరీస్ దేశవ్యాప్తంగా సంచలన రికార్డులు నమోదు చేయడంతో ప్రభాస్ అంటే తెలియని వారు ఎవ్వరూ లేరు.  టాలీవుడ్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకు కూడా లేదంటే అతిశయోక్తి కాదు. 

Advertisement

ప్రభాస్ సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ ఆయన సినిమాలు మినిమం కలెక్షన్లను వసూలు చేస్తాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ఎక్కువగా సలార్ సినిమా పైనే ఉన్నాయి. కేజిఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్  డైరెక్షన్లో ప్రభాస్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫోటోలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. సలార్ మూవీలో శృతిహాసన్ కథానాయకగా నటిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Advertisement

Manam News

ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా సలార్ వాయిదా అంటూ ఫిలిం సర్కిల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సలార్ సినిమా వాయిదా అంటూ వస్తున్న వార్తలను అసలు నమ్మవద్దని రిక్వెస్ట్ చేసింది.ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ పై వస్తున్న పుకార్లను పట్టించుకోకూడదని.. షూటింగ్ ఆలస్యంగా జరుగుతుందని రిలీజ్ వాయిదా పడుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులో “ఎలాంటి వాస్తవం లేదని మా మీద విశ్వాసం ఉంచండి. విడుదల తేదీ మాత్రం మారదు. మరుపురాని సినిమా అనుభవం కోసం మీరు సిద్ధంగా ఉండండి. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28, 2023 న విడుదల కాబోతుంది”  అంటూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పవన్ కళ్యాణ్ – దాసరి నారాయణరావుతో సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

 ‘దహాద్’ వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ…. ఓటిటిలో దుమ్ము లేపుతోంది

అనసూయ ఆస్తులు ఎంతో తెలుసా… తెలిస్తే అంతే!

Visitors Are Also Reading