Home » ‘లియో’లో విజయ్ డబుల్ రోల్.. ఏయే పాత్రలో అంటే ?

‘లియో’లో విజయ్ డబుల్ రోల్.. ఏయే పాత్రలో అంటే ?

by Anji
Ad

తమిళ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే తెలుగులో వారసుడు చిత్రంలో నటించాడు. ఆ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు, తమిళంలో నిర్మించారు.  సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ సాధించింది.   విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లియో. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్స్ స్టూడియో పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్, ఖదీర్, మన్సూర్ అలీ ఖాన్, దర్శకులు మిస్కిన్, గౌతమ్ మీనన్, మలయాళం నటుడు మ్యాథ్యూ థామస్ వంటి తదితరుల నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

మాస్టర్ వంటి విజయవంతమైన సినిమా తర్వాత విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొంత మేరకు షూటింగ్  పూర్తయింది. ప్రస్తుతం షూటింగ్ చెన్నైలో ముమ్మరంగా జరుగుతుంది.  మరో 20 రోజులపాటు జరిగే ఈ సినిమా షూటింగ్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ పార్ట్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. లియో సినిమాను అక్టోబర్ 19, 2023న విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయము విధితమే.

Advertisement

ఈ సినిమాలో విజయ్ దళపతి రెండు గెటప్ లతో కనిపించబోతున్నట్టు తాజా సమాచారం. ఒకటి లియో అనే గ్యాంగ్ స్టార్ గెటప్ కాగా.. మరొకటి చాక్లెట్ తయారు చేసే పార్టీ అనే సాధారణ యువకుడు గెటప్ లో కనిపించనున్నారు విజయ్. ఇందులో విజయ్ రెండు గెటప్  కనిపిస్తారా లేక రెండు పాత్రలు నటిస్తున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని అందిస్తుండగా మనోజ్ పరమహంస చాయాగ్రహణం అందిస్తున్నారు.

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఆశ్చర్యకర విషయాన్ని చెప్పిన తల్లి అంజనాదేవి..!

 కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించిన అదృష్ట శక్తి ఎవరో తెలుసా!

ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. సలార్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!

 

Visitors Are Also Reading