Home » ఐపీఎల్‌లో సంచలనం.. గుజరాత్‌ను వీడనున్న హార్దిక్‌.. మళ్లీ ముంబై గూటికే..!

ఐపీఎల్‌లో సంచలనం.. గుజరాత్‌ను వీడనున్న హార్దిక్‌.. మళ్లీ ముంబై గూటికే..!

by Anji
Ad

వన్డే  వరల్డ్  ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్ ఆడుతోంది. ఇంతలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 గురించి  షాక్ అయ్యే వార్త బయటికి వచ్చింది. అదేంటంటే.. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మళ్లీ తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌కు ఆడనున్నట్లు తెలుస్తోంది. కేవలం 2 సీజన్లకే హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌ జట్టును వీడడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం మినీ వేలం వచ్చే నెలలో దుబాయ్‌ వేదికగా జరగనుంది.   ప్రతిసారి ఇలాగే ఈ ఏడాది కూడా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను పరస్పరం ఆటగాళ్లను మార్చుకునేందుకు అవకాశమిచ్చారు.

Advertisement

మొత్తం 10 ఫ్రాంచైజీలకు ట్రేడ్ విండో తెరిచారు.  నవంబర్ 26న ఈ ట్రేడ్‌ విండ్‌ ముగుస్తుంది. నివేదికల ప్రకారం.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం 2 సీజన్ల తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. హార్దిక్ మరోసారి ముంబై ఇండియన్స్‌ జట్టులోకి పునరాగమనం చేస్తాడని చెబుతున్నారు. ఇందుకోసం ఇరు జట్ల మధ్య  రూ.15 కోట్ల రూపాయల డీల్ కుదిరిందని వార్తలు వస్తున్నాయి. హార్దిక్ ఐపీఎల్ కెరీర్ 2014-15లో ముంబై ఫ్రాంచైజీతోనే ప్రారంభమైంది. అయితే రెండు విజయవంతమైన సీజన్ల తర్వాత హార్దిక్ గుజరాత్ ను ఎందుకు విడిచిపెట్టారనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. 

Advertisement

కెప్టెన్‌ హార్దిక్, గుజరాత్‌ టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని.. అందుకే హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నారని బీసీసీఐ అధికారిని ఉటంకిస్తూ  ఓ మీడియా సంస్థ  కథనం కూడా ప్రచురించింది.  అసలు గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా, హార్దిక్ మధ్య సంబంధాల్లో చీలిక వచ్చిందా..? లేక ఫ్రాంచైజీతో సంబంధాలు చెడిపోయాయా అనే విషయంపై స్పష్టత మాత్రం  లేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లోనే అన్నీ సరిగ్గా లేవని.. గత 4 నెలల్లో ముంబైతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. హార్దిక్ 2021 సీజన్ వరకు ముంబై జట్టులోనే ఉన్నాడు. కానీ 2022 సీజన్‌కు ముందు కొత్త జట్లలో ఒకటైన గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హార్దిక్ నాయకత్వంలో గుజరాత్ తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచింది. 2023 సీజన్‌లోనూ పాండ్యా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌ గా నిలిచింది. 

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading