Home » Astrology: కలలో ఇవి కనిపించటం లక్ష్మీదేవి రాకకు సంకేతం..!

Astrology: కలలో ఇవి కనిపించటం లక్ష్మీదేవి రాకకు సంకేతం..!

by Bunty
Ad

 

ప్రతి ఒక్కరికి పడకున్నప్పుడు నిద్రలో కలలు రావడం సర్వసాధారణం. మనసు ప్రశాంతంగా ఉండే కలలు వస్తాయి. మరికొన్ని సందర్భాల్లో భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి కలలో దేవుళ్ళు, జంతువులు, కుటుంబీకులు కనిపిస్తూ ఉంటారు. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం కలలో ఇలాంటివి కనిపిస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం… చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభాకార్యాలు జరుగుతాయని సూచన.

Seeing these in a dream is a sign of the arrival of Goddess Lakshmi

Seeing these in a dream is a sign of the arrival of Goddess Lakshmi

లక్ష్మీదేవి కనుక కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం ఇప్పటికీ ఉంటుందని అర్థం. వినాయక స్వామి కనుక కలలో కనిపిస్తే అడ్డంకులు తొలగిపోతాయని, కుటుంబంలో ఆనందం, సంతోషాలు వస్తాయని అర్థం. పువ్వులు, చెట్లు కనుక కలలో కనిపిస్తే మనకు ఆరోగ్యం బాగుంటుందని అర్థం. మగవారికి వారి భార్య కనుక కలలో కనిపిస్తే ధన లాభం వస్తుందని, ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ ని పొందుతారని అర్థం. అదే విధంగా భార్యలకి భర్త కనుక కలలో కనిపిస్తే నిండు నూరేళ్లు దీర్ఘసుమంగళీగా ఉంటారట. కుంకుమ, పసుపు కలలో కనిపించినట్లయితే మనకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని, అదృష్టం కలిసి వస్తుందని అర్థం. ఆయుధాలు కలలో కనిపించినట్లయితే పూర్వకాలం నుంచి మనకు ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయని అర్థం.

Advertisement

Advertisement

అదేవిధంగా పాము కలలో కనిపించి కరిచినట్టు వస్తే మనకు మంచి జరుగుతుందని అర్థం. అదే పాము మన వెంట పడినట్టు వస్తే కష్టాలు వస్తాయని తెలుసుకోవాలి. పాలు కానీ నీళ్లు కానీ కలలో కనిపించినట్లయితే రాబోయే రోజుల్లో ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లు కలలో కనిపించినట్లయితే ఇంట్లో శుభాకార్యాలు జరుగుతాయని అర్థం. సామాన్యంగా ప్రతి ఒక్కరికి కలలో కాలుజారి పడినట్టు వస్తూ ఉంటుంది. అలా వచ్చినట్లయితే అష్ట కష్టాలు ఎదురవుతాయని ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఇంట్లో చనిపోయిన పూర్వీకులు కలలో కనిపించినట్లయితే దాన్ని శుభంగా భావించాలి. తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారు. గాజులు కనుక అమ్మాయిలకు కలలో వస్తే పెళ్లి కాని అమ్మాయిలకు త్వరలోనే వివాహం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. కలలో బంగారం ధరించినట్లు లేదా బంగారం చూసినట్లు వస్తే అపారమైనటువంటి సంపదలు జీవితంలోకి వస్తాయట.

ఇవి కూడా చదవండి

Mrunal Thakur : చిరంజీవి Mega-157లో మృణాల్ ఠాకూర్..?

Yogi Babu : యోగిబాబు రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది..హీరో కంటే ఎక్కువే !

దగ్గరుండి కూతురికి కులాంతర వివాహం జరిపించిన YCP ఎమ్మెల్యే.. !

Visitors Are Also Reading