దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను సినిమా తీశాడంటే ఆ సినిమా హిట్ గ్యారంటీ అనే విధంగా ప్రేక్షకులు నమ్ముతారు. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ గానే నిలిచాయి. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఒక్కో సినిమా ఒక్కో రేంజ్ రాజమౌళి ఇమేజ్ ని అమాంతం పెంచేశాయి. రాజమౌళి సినిమా తీయడం ఒక ఎత్తయితే సినిమాల్లో హీరో ఎంట్రీ ఇవ్వడం మరో ఎత్తు. ఇందులో సైన్స్ దాగి ఉంది. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ఏయే సినిమాలో హీరో ఎలా ఎంట్రీ ఇచ్చాడో ఇప్పుడు మనం చూద్దాం.
Advertisement
స్టూడెంట్ నెం.1
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్ బస్ కోసం పరుగెత్తుతున్న సీన్ తో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తాడు. రాజమౌళి తీసిన మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
సింహాద్రి
రాజమౌళి- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన రెండో సినిమా సింహాద్రి ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ నే మలుపు తిప్పిన చిత్రంగా సింహాద్రిని పేర్కొంటారు. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయేలా చూపించారు.
సై
నితిన్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సై సినిమా అప్పట్లో కుర్రకారులో మంచి జోష్ నింపింది. నైట్రస్ ఆక్సైడ్ గురించి చాలా మందికి రాజమౌళి తెరకెక్కించిన సై సినిమా ద్వారా తెలిసింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు అసలు నైట్రస్ ఆక్సైడ్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉండేది. ఈ సినిమాలో నితిన్ బైకు పై ఎంట్రీ ఇచ్చారు.
ఛత్రపతి
ప్రభాస్ సినీ కెరీర్ వర్షం సినిమా తరువాత అన్ని ప్లాఫ్ సినిమాలు వచ్చాయి. ఇక అదే సమయంలో రాజమౌళితో ఛత్రపతి సినిమాలో నటించారు. రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రభాస్ కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఇందులో ప్రభాస్ సముద్రంలో సొర చేపతో చేసే ఫైటింగ్ ద్వారా ఎంట్రీ ఇస్తాడు. ఇది ఈ సినిమాకే హైలెట్ అని చెప్పాలి.
Also Read : బాలయ్య అన్స్టాపబుల్ షోలో ప్రభాస్, గోపీచంద్.. ఫొటోలు ఇదిగో!
విక్రమార్కుడు
విక్రమార్కుడు సినిమాలో రవితేజను పవర్ పుల్ రోల్ లో చూపించాడు రాజమౌళి. ఈ సినిమాలో రవితే అద్భుతమైన నటనను కనబరిచాడు. రవితేజ మాస్ యాక్షన్ తో పాటు కామెడీని జోడించాడు. జింతాక చిత చిత అంటూ.. పాట ఈ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా రవితేజ అత్తిలిగా ఎంట్రీ ఇచ్చి అందరికీ అరగుండు చేయడం మంచి కామెడీగా అనిపిస్తుంది. కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించారు రాజమౌళి.
యమదొంగ
యమదొంగ సినిమాతో ఎన్టీఆర్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టారు రాజమౌళి. యమదొంగలో ఎన్టీఆర్ ఎంట్రీ ని అలీ అద్భుతంగా పరిచయం చేస్తాడు. ఎన్టీఆర్-ఆలీ ఈ చిత్రంలో దొంగలుగా నటించారు. ఎన్టీఆర్, మోహన్ బాబు నటన అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమాలో రబ్బరు గాజులు రబ్బరు గాజులు అనే పాట సినిమాకే హైలెట్ గా నిలిచింది.
Advertisement
Also Read : Honsika motwani: పెళ్లిలో హన్సిక వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
మర్యాద రామన్న
అప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్ లు సాధించిన రాజమౌళి కామెడీ హీరోలతో కూడా హిట్ సాధించగలడని మర్యాద రామన్న సినిమాతో ప్రూవ్ అయింది. ఈ సినిమాలో సునీల్ సైకిల్ ఎంట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. కామెడీ సీన్ తో ఎంట్రీ ఇస్తాడు సునీల్.
మగధీర
రామ్ చరణ్ చిరుత సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రంలో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసింది. అప్పటి వరకు ఉన్న పోకిరి రికార్డు ను సైతం తిరగరాసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విడుదలైన మగధీర రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ బైరవుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. రామ్ చరణ్ ఎంట్రీ కూడా సినిమా డిఫరెంట్ గా ఉండడం విశేషం.
Also Read : సంచలనం రేపుతున్న కృష్ణ వీలునామా…400 కోట్ల ఎవరికి చెందుతాయంటే..?
ఈగ
నేచురల్ స్టార్ నాని, సమంత జంటగా నటించిన చిత్రం ఈగ. ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. ఈ సినిమాలో ఈగను రాజమౌళి అద్భుతంగా సృష్టించారనే చెప్పాలి. ఇందులో నాని తక్కువ సేపు కనిపించినప్పటికీ ఈగ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.
బాహుబలి
ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలితో రాజమౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ అద్భుతమనే చెప్పాలి.
Also Read : NRI లను పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ 6 మంది టాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే
బాహుబలి 2
బాహుబలి సినిమా మంచి విజయం సాధించడంతో బాహుబలి 2 ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రేక్షకుల అంచనాకు తగ్గట్టే రాజమౌళి బాహుబలి 2ని తెరకెక్కించారు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్య నటన ఈ సినిమాకే హైలెట్. బాహుబలి సినిమాతో అటు ప్రభాస్, ఇటు రాజమౌళి పాన్ ఇండియా స్టార్లుగా మారారు.
ఆర్ఆర్ఆర్
బాహుబలి 2 హిట్ తరువాత రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. హాలీవుడ్ దర్శకులు సైతం రాజమౌళిని ప్రశంసించారు. ఇందులో ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పాలి.
రామ్ చరణ్ కూడా అద్భుతంగా నటించాడు. వీరి ఎంట్రీ సీన్లు అద్భుతంగా తెరకెక్కించారు రాజమౌళి. సినిమా తీయడమే కాదు.. సినిమాలో హీరోల ఎంట్రీలో కూడా అద్భుతాలు చేయగలడని నిరూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి.
Also Read : బాలయ్య షోలో ప్రభాస్ ధరించిన షర్టు ఖరీదు ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!