Home » బాలయ్య షోలో ప్రభాస్ ధరించిన షర్టు ఖరీదు ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలయ్య షోలో ప్రభాస్ ధరించిన షర్టు ఖరీదు ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Bunty
Ad

బాలయ్య క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన అన్ స్టాపబుల్ టాక్ షో ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ టాక్ షోగా పేరు తెచ్చుకుంది. ఈ షోకు ఇప్పటికే పలువురు స్టార్లు వచ్చి అందరిని ఉత్సాహపరిచారు. ఇక తాజాగా బాలయ్య క్రేజీ షోకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్ తో కలిసి పాల్గొన్నారు. డిసెంబర్ 11న వీరికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ జరగగా, ఈరోజు ప్రభాస్, గోపీచంద్ ఫొటోస్ రిలీజ్ చేసింది ఆహా. అందులో డార్లింగ్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు.

Advertisement

అంతేకాకుండా చిరునవ్వుతో ఎంతో సరదాగా కనిపిస్తున్నారు ప్రభాస్. అలాగే బాలయ్యతో కలిసి గోపీచంద్, ప్రభాస్ అన్ స్టాపబుల్ వేదికపై రచ్చ రచ్చ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం కోసం ప్రభాస్ పసుపు నీలిరంగు గీతలు కలిగినటువంటి చొక్కాను ధరించి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రభాస్ బాలయ్య షో కోసం ధరించిన ఈ షర్ట్ ఖరీదు ఎంత ఉంటుందని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ షర్ట్ ఖరీదు తెలిసిన అనంతరం ప్రతి ఒక్క నెటిజన్, అభిమాని షాక్ కి గురవుతున్నారు.

Advertisement

ఈ కార్యక్రమం కోసం ప్రభాస్ ధరించిన షర్ట్ ఖరీదు అక్షరాల 115 పౌండ్స్ అనగా ఇండియన్ కరెన్సీలో ఈ షర్ట్ ఖరీదు రూ. 11,618.09 కావడం గమనార్హం. ఇలా ప్రభాస్ ధరించిన ఈ డ్రెస్ ఇంత ఖరీదు అని తెలియడంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. అయితే సెలబ్రిటీలు ఇలా బ్రాండెడ్ ఖరీదైన దుస్తులను ధరించడం సర్వసాధారణం. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య ప్రభాస్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. వాటి ప్రభాస్ సమాధానాలు ఎలా ఉండబోతాయనే విషయం గురించి అభిమానులు ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. కాగా, ప్రభాస్, గోపీచంద్ కు సంబంధించిన ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

read also : Sanju Samson : టీమిండియాలో ఛాన్సులు రాక ఐర్లాండ్ కు ఆడనున్న సంజూ !

Visitors Are Also Reading