Home » బాలయ్య అన్​స్టాపబుల్​ షోలో ప్రభాస్, గోపీచంద్​.. ఫొటోలు ఇదిగో!

బాలయ్య అన్​స్టాపబుల్​ షోలో ప్రభాస్, గోపీచంద్​.. ఫొటోలు ఇదిగో!

by Bunty
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఆహా “ఓటిటి” ప్లాట్ ఫామ్ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ టాక్ షో సీజన్ 2 కొనసాగుతుంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2 లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్, శర్వానంద్, అడవి శేషులు విచ్చేశారు.

read also : Sanju Samson : టీమిండియాలో ఛాన్సులు రాక ఐర్లాండ్ కు ఆడనున్న సంజూ !

Advertisement

 

తాజాగా ఈ షోకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపిచంద్ తో కలిసి పాల్గొన్నారు. డిసెంబర్ 11న వీరికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ జరగగా ఈరోజు ప్రభాస్, గోపీచంద్ ఫొటోస్ రిలీజ్ చేసింది ఆహా. అందులో డార్లింగ్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. అంతేకాకుండా చిరునవ్వుతో ఎంతో సరదాగా కనిపిస్తున్నారు ప్రభాస్.

Advertisement

అలాగే బాలయ్యతో కలిసి గోపీచంద్, ప్రభాస్ అన్ స్టాపబుల్ వేదికపై రచ్చ రచ్చ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్టు కే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల మెగా ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబు దగ్గుబాటి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాలయ్యతో కలిసి చేసిన అల్లరి తెలిసిందే. తాజాగా ఈ షోకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్ తో కలిసి పాల్గొన్నారు. కాగా ప్రస్తుతం హీరో ప్రభాస్‌ సలార్‌ మూవీ షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. రాధే శ్యామ్‌ సినిమా అట్టర్‌ ఫ్లాఫ్‌ కావడంతో, ఈ సారి ఎలాగైన హిట్‌ కొట్టాలని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చూస్తున్నారు. మరి సలార్‌ మూవీ, ఆది పురుష్‌ సినిమాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఎలాంటి హిట్‌ ఇస్తాయో చూడాలి.

read also : పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తులు విలువ తెలుసా? ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !

Visitors Are Also Reading