Home » హీరోయిన్ల విషయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు మరీ ఇలా ఉండేవారా..?

హీరోయిన్ల విషయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు మరీ ఇలా ఉండేవారా..?

by Sravanthi Pandrala Pandrala

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి టాప్ హీరోలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్,ఏఎన్నార్ లు మాత్రమే. వారు సినిమాలు తీయడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీని ఎంతో అభివృద్ధి చేయడంలో చాలా చక్కని పాత్ర పోషించారని చెప్పవచ్చు. అందుకే వారి గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా గుర్తు చేసుకుంటూనే ఉంటారు.. ప్రస్తుతం వారు హీరోయిన్ల ఎంపిక విషయంలో ఏ విధంగా ఉండేవారో అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అదేంటయ్యా అంటే.. ప్రస్తుతం ఏ హీరోకైనా తనతో నటించే జోడీ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు డైరెక్టర్లు.. హీరో సరసన నటించే హీరోయిన్ విషయంలో ఎవరిని తీసుకోవాలనేది తప్పకుండా ఈరోజుల్లో క్లారిటీ ఇవ్వాల్సిందే.. ఒక్కోసారి దర్శకుడు మరియు హీరో కలిపి ఫలానా హీరోయిన్ ను ఈ సినిమాకు తీసుకుంటే సెట్ అవుతుందని అనుకున్న పరిస్థితులు ఉన్నాయి.

అయితే ఎన్టీఆర్,ఏఎన్నార్ కాలంలో మాత్రం అలాంటి పరిస్థితి ఉండేది కాదు. స్టోరీ ని బట్టి హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనేది దర్శకుడు, నిర్మాత మాత్రమే నిర్ణయం తీసుకునే వారు. అప్పట్లో కథా,కథనం హీరో కే పెద్ద పీట వేసేవారు. అందుకే హీరో కు తగ్గట్టుగా హీరోయిన్ల పాత్రలు కూడా ఉండేవి. ఆ సమయంలో హీరోయిన్లు కూడా పోటీపడి మరీ నటించేవారు. కానీ ఆ ట్రెండ్ అంతా మారిపోయింది.. ప్రస్తుత కాలంలో హీరోకు తగ్గట్టుగానే హీరోయిన్ ను ఎంపిక చేసుకుంటున్నారు.. మరి ఆ హీరోయిన్లు ఒకటి రెండు సినిమాల్లో నటిస్తే మరీ ఎక్కువ అనే పరిస్థితి కూడా వచ్చింది. దీనివల్ల హీరోయిన్లకు కథపై స్కోప్ ఉండకపోవడం వల్ల, గ్లామర్ రోల్స్ కు, వారి ఎక్స్పోజింగ్, డాన్సులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ హీరోయిన్స్ బొమ్మలుగా తయారవుతున్నారు. గతంలో అలా ఉండేది కాదు.. అయితే ఆ సమయంలో అక్కినేనితో ఉన్నటువంటి చనువు , ఎన్టీఆర్ తో ఉండేది కాదని, అందువల్లే అక్కినేని ఎక్కువ మంది హీరోయిన్లతో నటించారనే రూమర్ కూడా నడుస్తుంది.

అక్కినేని ఏ హీరోయిన్ తో నైనా త్వరగా కలిసిపోయే వారిని, వారితో జోకులు వేసుకుంటూ సరదాగా మాట్లాడుతూ హీరోయిన్ లను మచ్చిక చేసుకుని నటనకు స్కోప్ ఉన్న హీరోయిన్లకు ఛాన్స్ ఇచ్చేవారని తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ మాత్రం సెట్ పై చాలా సీరియస్ గా ఉండేవారని. అందువల్లే ఆయన సావిత్రి తోనే అనేక సినిమాలు కనిపిస్తూ ఉంటాయి.. ఎన్టీఆర్ హీరోయిన్లతో సీరియస్ గా ఉంటూ సెట్లోకి వచ్చామా.. నటించామా.. పాత్ర చాలా బాగా పండిందా.. అనే విషయాలను మాత్రమే ఎక్కువగా ఆలోచించే వారని దీని వల్ల ఆయన ఎక్కువ మంది హీరోయిన్లతో సినిమాలు చేయలేదని చెబుతుంటారు.. ఏఎన్నార్ కి హీరోయిన్లతో ఉన్నంత అటాచ్మెంట్ ఎన్టీఆర్ కు ఉండేది కాదని అంటుంటారు. ఏది ఏమైనా ఎన్టీఆర్,ఏఎన్ఆర్ సినిమా ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు అనే విషయం అందరికీ తెలిసిందే..

ALSO READ;

Visitors Are Also Reading