Home » అభిషేక్ తో డేటింగ్ టైంలో ఐశ్వర్య ఏ గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా ?

అభిషేక్ తో డేటింగ్ టైంలో ఐశ్వర్య ఏ గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా ?

by Bunty
Ad

నటుడు అభిషేక్ బచ్చన్ ఈ రోజుల్లో తన చిత్రం ‘బాబ్ బిస్వాష్’ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అభిషేక్ ఇటీవల ‘ది రణవీర్ షో’లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య ఐశ్వర్యరాయ్ తనకు ఓ సర్ప్రైజ్ ఇచ్చిందని, అది చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు. తనకు ఇష్టమైన పాట గురించి అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ అమెరికన్ రాపర్ నెల్లీ పాడిన పాట ‘డైలమా’ తన ఫేవరెట్ అని చెప్పాడు. ఈ పాట 2002లో విడుదలైంది.

ishwarya

Advertisement

Advertisement

డేటింగ్ రోజుల్లో ఐశ్వర్య గిఫ్ట్
తాను అమెరికన్ సింగర్ రాపర్‌కి పెద్ద అభిమానినని, నేటికీ తనకు ఇష్టమైన పాట ఇదేనని అభిషేక్ వెల్లడించారు. మేము ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్న సమయంలో ఐష్ తన కోసం నెల్లీ ఆటోగ్రాఫ్‌ తీసుకువచ్చి సర్ప్రైజ్ చేసిందని చెప్పాడు. ఇది ఇప్పటికి తన టేబుల్‌పై ఉందని, నిజంగా అదొక అద్భుతమని అభిషేక్ చెప్పుకొచ్చాడు. అభిషేక్ ఇంకా మాట్లాడుతూ నెల్లీతో కూడా పాడాను. నేను భారతీయ కెనడియన్ గాయకుడు అయిన నా స్నేహితుడు రాఘవ్‌తో కలిసి ఈ ట్రాక్‌ని చేసాను. 2007లో అభిషేక్, ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అందమైన కుమార్తె ఆరాధ్య ఉంది. 2018లో అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నేను నా కెరీర్ ప్రారంభ చిత్రాలలో మొదటిసారిగా ఐశ్వర్యతో కలిసి పని చేశాను. మేమిద్దరం మొదట ‘ధై అక్షర ప్రేమ్‌’లో కలిసి పనిచేశాం. అప్పటి నుంచి మేం స్నేహితులం. ఆ తర్వాత మా స్నేహం మరింత బలపడి, క్రమంగా అది స్నేహం కంటే ఎక్కువైంది” అన్నారు.

Visitors Are Also Reading