Home » స‌ర్కారు వారి పాట క‌ళావ‌తి సాంగ్ లీక్‌..?

స‌ర్కారు వారి పాట క‌ళావ‌తి సాంగ్ లీక్‌..?

by Anji
Ad

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ద‌ర్శ‌కుడు పర‌శురామ్ కాంబినేష‌న్‌లో తీస్తున్న స‌ర్కారువారి పాట సినిమా ఈ ఏడాది వేసవి కానుక‌గా మే 12న విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే.మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా.. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ బ్లాస్ట‌ర్ టీజ‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. స‌ర్కారు వారి పాట‌లో స‌ముద్ర ఖ‌ని విల‌న్‌గా చేస్తుండ‌గా.. సుబ్బ‌రాజు, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్ వంటి వారు న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి క‌ళావ‌తి ప‌ల్ల‌వితో సాగే ఫ‌స్ట్ సాంగ్ ప్రోమో నిన్న యూట్యూబ్‌లో విడుద‌ల చేసింది చిత్ర బృందం.

Also Read :  ల‌తా మంగేష్క‌ర్ చివ‌ర‌గా మాట్లాడిన మాట‌లు ఏమిటో తెలుసా..?

Advertisement

Advertisement

ఈ పాట‌లో మ‌హేష్‌తో పాటు కీర్తి సురేష్ కూడా అందంగా మెరిసిపోయింది. దీంతో పుల్ సాంగ్‌పై అంద‌రిలో ఆస‌క్తి పెరిగింది. థ‌మ‌న్ మెలోడియ‌న్‌గా స్వ‌ర‌పరిచిన ఈ సాంగ్‌ను సిద్ శ్రీ‌రామ్ ఆల‌పించారు. ఈ సాంగ్ పుల్ లిరిక‌ల్ వీడియోను ఎల్లుండి ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌నున్న యూనిట్‌కు ఇవాళ ఒక్క‌సారిగా ఎదురుదెబ్బ త‌గిలింది. క‌ళావ‌తి పుల్ సాంగ్ కొద్ది సేప‌టి క్రిత‌మే ప‌లు సోష‌ల్ మీడియాలో లీకై వైర‌ల్ అవుతున్న‌ట్టు స‌మాచారం.

మ‌రొక వైపు సాంగ్ లీక్ పై సూప‌ర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నిర్మాత‌ల‌పై సోష‌ల్ మీడియాలో విరుచుకుప‌డుతూ కామెంట్లు చేస్తున్నారు. గ‌తంలో ఈ మూవీ టీజ‌ర్ కూడా ఇలాగే లీక్ అయిందని, ఇప్పుడు పాట కూడా లీక్ కావ‌డంతో అస‌లు ప్రేక్ష‌కులు, అభిమానులు సైతం ప్ర‌శ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. స‌ర్కారు వారి పాట నిర్మాత‌లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మ‌రీ.

Also Read :  సుమ రాజీవ్ ఇద్ద‌రిలో ఎవరి సంపాద‌న ఎక్కువో తెలుసా..!

Visitors Are Also Reading