Home » సుమ రాజీవ్ ఇద్ద‌రిలో ఎవరి సంపాద‌న ఎక్కువో తెలుసా..!

సుమ రాజీవ్ ఇద్ద‌రిలో ఎవరి సంపాద‌న ఎక్కువో తెలుసా..!

by AJAY
Ad

బుల్లితెర‌పై యాంక‌ర్ గా సుమ‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. స్టార్ యంక‌ర్ గా సుమ కొన్నేళ్లుగా రానిస్తున్నారు. బ‌డా సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్ ల‌కు దాదాపుగా సుమ‌నే యాంక‌రింగ్ చేస్తుంటారు. అయితే సుమ భ‌ర్త రాజీవ్ క‌న‌కాల కూడా న‌టుడే అన్న సంగ‌తి తెలిసిందే. సినిమాల్లో రాజీవ్ క‌న‌కాల ముఖ్య‌మైన పాత్ర‌లు చేస్తుంటారు. రీసెంగ్ ల‌వ్ స్టోరీ సినిమ‌లో విల‌న్ పాత్ర‌లో న‌టించి రాజీవ్ క‌న‌కాల మెప్పించారు. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ రాజీవ్ క‌న‌కాల‌ను ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న అడిగింది.

rajeev kanakala

rajeev kanakala

సుమ మీకంటే ఎక్కువ సంపాదిస్తారా అంటూ ప్ర‌శ్నించింది. దానికి రాజీవ్ క‌న‌కాల ఖ‌చ్చితంగా….మీకు క‌నిపించేది అదే క‌దా నేను వేరే మార్గాల ద్వారా సంపాదిస్తుంటాను అంటూ ఆన్స‌ర్ ఇచ్చారు. అంతే కాకుండా బుల్లితెర హీరో అనొచ్చు సుమ‌ను అంటూ యాంక‌ర్ వ్యాఖ్యానించగా మీరు అనొచ్చు నేను అన‌కూడ‌దు ఇంకా చాలా మంది ఉన్నారు క‌దా యాంక‌ర్స్ వాళ్లు హ‌ర్ట్ అవుతారు అంటూ స‌మాధానం ఇచ్చాడు.

Advertisement

Advertisement

ఇక త‌న సినిమాల విష‌యానికి వ‌స్తే త‌న‌కు ఫుల్ లెన్త్ పాత్ర‌లు ఎక్కువ‌గా రావ‌డం లేద‌ని రాజీవ్ క‌న‌కాల చెప్పారు. ఈ మ‌ధ్య మీమ్ చూశాన‌ని అందులో రాజీవ్ క‌న‌కాల సినిమాలో న‌టిస్తున్నారంటే మ‌ధ్య‌లో చంపేస్తారా చివ‌రి వ‌ర‌కూ ఉంటారా అంటూ ఉంద‌ని తెలిపారు.

ALSO READ : JABARDASTH : పారితోషికాలు భారీగా పెంచేసిన జ‌బ‌ర్ద‌స్త్..ఒక్కొక్క‌రికీ ఎంత ఇస్తున్నారో తెలుసా..!

ఇక ప్ర‌స్తుతం తాను రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్ అనే షోకు జ‌డ్జిగా చేస్తున్నాన‌ని రాజీవ్ క‌న‌కాల అన్నారు. అందులో న‌టులు చాలా బాగా కామెడీ చేస్తున్నార‌ని జోక్ పేల‌కుంటే తాను ఆర్టిఫిషియ‌ల్ గా న‌వ్వ‌లేన‌ని అన్నారు. త‌న‌కు కూడా ఎంతో స‌ర‌దాగా ఉందని సినిమాల్లో వ‌చ్చే పాత్ర‌ల‌తో తాను కూడా విసిగిపోయాన‌ని చెప్పారు. జ‌డ్జ్ ఫీలింగ్ బాగుంద‌ని చెప్పారు.

Visitors Are Also Reading