Home » ఫస్ట్‌ మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్‌ ఖాన్‌

ఫస్ట్‌ మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్‌ ఖాన్‌

by Anji
Ad

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో.. టీమిండియా యంగ్ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తన సత్తా చూపించాడు. మొదటి మ్యాచ్‌లోనే ఏకంగా హాఫ్‌ సెంచరీ చేసి చెలరేగిపోయాడు. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి.. ఇంగ్లండ్‌ బౌలర్లకు చెమటలు పట్టించేశాడు. ఈ క్రమంలోనే ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో మొదటి మ్యాచ్‌లోనే అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా సర్ఫరాజ్‌ చరిత్ర సృష్టించాడు.

Advertisement

 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టుకు మొదట్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 33 పరుగులకే 3 వీకెట్లు పడిపోయాయి. వరుస ఓవర్లలో యశస్వీ జైస్వాల్‌ (10), శుభ్‌మన్‌ గిల్‌ను ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ ఔట్‌ చేశాడు. లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోగా.. 93 పరుగులు చేసింది. ఇక రెండో సెషన్‌లో రోహిత్‌ సెంచరీ, రవీంద్ర జడేజా హాఫ్‌ సెంచరితో రెచ్చిపోయారు. టెస్టులో రోహిత్‌కు ఇది 11వ సెంచరీ. వీళ్లిద్దరి భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. రెండో సెషన్‌లో మాత్రం ఇంగ్లండ్‌కు ఒక్క వికెట్‌ కూడా పడగట్టలేకపోయింది. ఇక మూడో సెషన్‌లో రోహిత్‌, జడేజాల పార్ట్నర్‌షిప్ 200 దాటింది. ఇలా స్కోర్‌ పెరుగుతున్న తరుణంలో హిట్‌మ్యాన్‌ను మార్కు వుడ్‌ ఔట్‌ చేశాడు. దీంతో 204 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లైంది. 196 బంతుల్లో రోహిత్ 14 ఫోర్లు, 3 సిక్సులతో 131 పరుగులు చేశాడు.

Advertisement

 

మొత్తానికి 237 పరుగులకు టీమిండియా నాలుగో వికెట్లు పడిపోయాయి. ఈ సమయంలోని క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడు యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్‌. తన వన్డే స్టైల్‌లో చెలరేగిపోయాడు. జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు చేశాడు. అయితే 82వ ఓవర్లలో సర్ఫరాజ్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో 314 పరుగులకు టీమిండియా సగం వికెట్లు పోగొట్టుకుంది. ఇక సర్ఫరాజ్‌ ఖాన్ 66 బంతుల్లో .. 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 62 పరుగులు చేశాడు. అయితే సర్ఫరాజ్‌ తన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీతో చెలరేగిపోవడంతో.. అతనిపై అటు క్రికెటర్లు, ఇటు క్రికెట్‌ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Also Read :  హార్దిక్ పాండ్యకి తిక్క కుదిరింది ! భలే ఝలక్ ఇచ్చిన జైషా

 

Visitors Are Also Reading