Home » హార్దిక్ పాండ్యకి తిక్క కుదిరింది ! భలే ఝలక్ ఇచ్చిన జైషా

హార్దిక్ పాండ్యకి తిక్క కుదిరింది ! భలే ఝలక్ ఇచ్చిన జైషా

by Anji
Published: Last Updated on
Ad

రాబోయే టీ-20 ప్రపంచకప్ లో టీమిండియాకి కెప్టెన్ ఎవరు..? అనే సందేహాలకు బీసీసీఐ సెక్రెటరీ జై షా క్లారిటీ ఇచ్చాడు. గత ఏడాది ప్రపంచ కప్ నేపథ్యంలో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కే.ఎల్.రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు టీ-20 మ్యాచ్ లు ఆడని విషయం తెలిసిందే. వన్డే ఫార్మాట్ పై పూర్తి ఫోకస్ చేశారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో కుర్రాళ్లతో కూడిన జట్టు టీ-20 సిరీస్ లు ఆడింది.

Advertisement

అయితే టీ-20 ప్రపంచ కప్ 2024 కోసమే హార్దిక్ సారథ్యంలో జట్టును తయారు చేస్తున్నామని కూడా అప్పట్లో బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. వన్డే ప్రపంచ కప్ లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన టీమిండియా కీలక ఫైనల్ లో విఫలం చెంది టైటిల్ ను చేజార్చుకుంది. టీ-20 ప్రపంచ కప్ 2024 అమెరికా, వెస్టిండిస్ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. పొట్టి ప్రపంచ కప్ లో సీనియర్ ఆటగాళ్లను కూడా భాగం చేస్తున్న బీసీసీఐ పరోక్ష సూచనలు ఇచ్చింది. అప్గానిస్తాన్ తో గత నెలలో జరిగిన మూడు టీ-20 సిరీస్ కి కోహ్లీ, రోహిత్ ను ఎంపిక చేసింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ క్యాష్ ట్రేడ్ డీల్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది.

Advertisement

ఇక వెంటనే ముంబై కెప్టెన్ గా హార్దిక్ ని ప్రకటించింది. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ముంబై పై కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఈ తరుణంలోనే టీ-20 ప్రపంచ కప్ 2024లో ఎవరు సారథ్యం వహిస్తారు అనేది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. సీనియర్ రోహిత్ శర్మకే సారథ్య బాధ్యతలను అప్పగిస్తారా..? లేక హార్దిక్ అప్పగిస్తారా..? అనేది చర్చనీయాంశమైంది. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్ కి ఆతిత్యం ఇవ్వనున్న రాజ్ కోట్ మైదానం పేరును నీరంజన్ షా స్టేడియంగా పేరు మార్చారు. ఇవాళ జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జైషా.. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా టీ-20 ప్రపంచ కప్ 2024 ఆడుతుందని స్పష్టం చేశాడు. దీంతో టీమిండియా కెప్టెన్ ఎవ్వరు అనే క్లారిటీ వచ్చేసింది.

Also Read : జస్ప్రీత్ బుమ్రాపై దాడికి సిద్ధం.. బెన్ స్టోక్స్ షాకింగ్ కామెంట్స్ ..!

Visitors Are Also Reading