Home » టెండూల్కర్ సారాను వదిలేసి ఖాన్ సారాను పట్టుకున్న గిల్..!

టెండూల్కర్ సారాను వదిలేసి ఖాన్ సారాను పట్టుకున్న గిల్..!

by Azhar
Ad

భారత యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ టెస్టు జట్టులో ఎప్పుడో తన స్థానం అయితే స్థిరం చేసుకున్నాడు. ఇక ఈ మధ్యే వన్డేలలో కూడా తన ప్లేస్ అనేది ఖాయం చేసుకున్నాడు. ఈఏడాది ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆడిన వన్డే సిరీస్ లలో గిల్ రెచ్చిపోయాడు. రేడు సిరీస్ లలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు.

Advertisement

అయితే తన బ్యాటింగ్ తో జట్టులో స్థానం అనేది స్థిరం చేసుకున్న గిల్.. మనసులో అమ్మాయి స్థానాన్ని స్థిరం చేసుకోలేకపోతున్నాడు. కానీ ఒక్క పేరును మాత్రం ఖాయం చేసుకున్నాడు. అదే సారా. అయితే ఇన్ని రోజులు గిల్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమాయణం నడిపిస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. అదే విధంగా ఈ మధ్యే వారికీ బ్రేకప్ కూడా అయ్యిపోయింది అని కూడా వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే అలా ఆ సారా టెండూల్కర్ తో బ్రేకప్ అయ్యిందో లేదో.. ఇప్పుడు మరో సారాను పట్టుకునాడు గిల్. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్. అయితే తాజాగా గిల్, సారా ఇద్దరు దుబాయ్ లోని ఒక్క హోటల్ లో డిన్నర్ చేస్తూ కనిపించారు. అంతే వారి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు జనాలు. ఇప్పుడు ఆ ఫోటోలు, ఈ వార్తలు అనేవి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

రేటింగ్స్ ను తిరగరాసిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్…!

గత ఏడాది కోహ్లీ చేసిన తప్పే.. ఇప్పుడు బాబర్ చేశాడా..?

Visitors Are Also Reading