Home » విజయ్ సినిమాలో విలన్ గా సంజయ్..?

విజయ్ సినిమాలో విలన్ గా సంజయ్..?

by Azhar
Ad

హీరో దళపతి విజయ్ కి సౌత్ మొత్తం ఎంత క్రేజ్ అనే విషయం తెలిసిందే. ఈయన పేరుకే తమిళ హీరో అయిన ఈయన నటించే ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది. అయితే ప్రస్తుతం తన కెరియర్ లో 66 వ సినిమాగా వారసుడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం చేస్తుండగా.. నిర్మాతగా దిల్ రాజు ఉన్నారు.

Advertisement

ఇక ఈ మధ్యే ఈ సినిమా విడుదలకు ముందే 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే విజయ్ యొక్క తరువాతి సినిమా గురించి కొన్ని కీలక విషయాలు అనేవి బయటకు వస్తున్నాయి. అయితే విజయ్ తన 67వ సినిమా లోకేష్ కనకరాజ్ తో తీస్తున్న విష్యం తెలిసిందే. ఈయన ఈ మధ్యే విక్రమ్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు.

Advertisement

అందుకే విజయ్, లోకేష్ కాంబినేషన్ లో వచ్చే సినిమా పైన కూడా భారీ అంచనాలు అనేవి నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో విజయ్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై ఆయనను సంప్రదించగా సంజయ్ కూడా దీనికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ సినిమాలో చేయడనికి 10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

జయవర్ధనే, జహీర్‌ఖాన్‌లకు కొత్త పదవులు ఇచ్చిన ముంబై..!

మొదటికొచ్చిన పంత్, ఊర్వశీ వ్యవహారం..!

Visitors Are Also Reading