Home » జయవర్ధనే, జహీర్‌ఖాన్‌లకు కొత్త పదవులు ఇచ్చిన ముంబై..!

జయవర్ధనే, జహీర్‌ఖాన్‌లకు కొత్త పదవులు ఇచ్చిన ముంబై..!

by Azhar
Ad
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉంది అంటే అది ముంబై ఇండియన్స్ అనే చెప్పాలి. ఏ జట్టుకు సాధ్యం కానీ విధంగా ఇప్పటివరకు అత్యధికంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ అనేది అందుకుంది ముంబై జట్టు. అయితే ఈ విజయాలలో ఆ జట్టు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న మహేల జయవర్ధనే కీలక పాత్ర అనేది పోషిస్తున్నాడు.
అటువంటి జయవర్ధనేకు అలాగే ఆ జట్టు కోచింగ్ సిబ్బందిలో ఉన్న జహీర్ ఖాన్ కు ముంబై యాజమాన్యం కీలక పదవులు అప్పగించింది. అయితే ఈ ఐపీఎల్ లో మాత్రమే కాకుండా వచ్చే ఏడాది ప్రారంభం అవుతున్న సౌత్ ఆఫ్రికా క్రికెట్ లీగ్.. అలాగే యూఏఈ ప్రారంభిస్తున్న వరల్డ్ క్రికెట్ లీగ్ లో కూడా ఇదే యాజమాన్యం రెండు జట్లను కొనుగోలు చేసింది. ఈ అన్ని టీమ్స్ ను కలిసి వారు ఎంఐ వన్ ఫ్యామిలీ అని పిలుస్తుంటారు.
అయితే ఈ అన్ని జట్ల బాధ్యతలను చూసుకునే విధంగా జయవర్ధనేను గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ముంబై అలాగే జహీర్ ఖాన్ ను గ్లోబల్ హెడ్‌ ఆఫ్ డెవలప్ మెంట్‌గా నియమించింది. అంటే జయవర్ధనే ముంబైకి సంబంధిన మూడు జట్ల కోచ్ లతో మాట్లాడుతూ.. ముంబై బ్రాండ్ ను తగ్గకుండా చూసుకోవాలి. ఇక జహీర్ ఖాన్ ఆ దేశాలలో ఉన్న మంచి ఆటాగాళ్లను గుర్తించడం.. అలాగే వారితో చేయిచాల్సిన ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తాడు.

Advertisement

Visitors Are Also Reading