Home » మేడారం గద్దెపైకి చేరుకున్న సమ్మక్క

మేడారం గద్దెపైకి చేరుకున్న సమ్మక్క

by Anji
Ad

మేడారం మహా జాతర లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. బుధవారం సారలమ్మ తల్లి గద్దెలను వేంచేయగా.. గురువారం చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దెలను అధిష్టించడానికి బయలు దేరింది. ఆలయ పూజారులు సమ్మక్క అమ్మ వారిని..తమ సంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమ రూపంలో ఉన్న సమ్మక్క అమ్మ వారిని తీసుకొని బయలు దేరారు. ముందుగా పూజారులు ఆదివాసి సాంప్రదాయ పద్ధతుల ప్రకారం చిలుకల గుట్ట దగ్గర సమ్మక్కకు పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ మూడు రౌండ్లు ఫైరింగ్ చేశారు. దీంతో చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి బయలుదేరి గద్దెకు చేరుకొన్నారు.

Advertisement

Advertisement

సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. సారలమ్మను కొలువుదీర్చే క్రతువు ఉదయమే ప్రారంభమైంది. జాతర మొదటిరోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. రాష్ట్రం తోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి జనం తరలిరావడంతో మేడారం పరిసరాలు కిక్కెరిసి పోయాయి. వేల మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు దీరడంతో క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి.

Also Read  : మోడీకి తగ్గని క్రేజ్.. అత్యంత ప్రజాదారణ నేతగా మరోసారి అగ్రస్థానం..!

Visitors Are Also Reading