Home » యోధుడు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడి పై సమంత ప్రశంసలు…!

యోధుడు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడి పై సమంత ప్రశంసలు…!

by AJAY
Ad

టాలీవుడ్ హీరోయిన్ సమంత నాగచైతన్య మధ్య గతేడాది విడాకులు జరగ్గా కొంత కాలం పాటు సమంత మీడియాకు సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఆ తరవాత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ తో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఊ అంటావా మామా అనే పాటతో సమంత కుర్రాళ్లను షేక్ చేసింది. అంతే కాకుండా ఇప్పటికే సమంత శాకుంతలం అనే సినిమా కూడా పూర్తి చేసింది. రీసెంట్ గా ఈ సినిమా పోస్టర్ విడుదల కాగా త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కాబోతుంది.

Advertisement

Advertisement

ఇక ఎప్పుడూ సమంత సోషల్ మీడియాలో యాక్టిివ్ గా ఉంటూ సామాజిక రాజకీయ అంశాల పై స్పందిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సమంత రష్యా ఉక్రెయిన్ యుద్ధం పై కూడా స్పందించింది. అంతే కాకుండా ఉక్రెయిన్ పై రష్యా దాడిని సమంత ఖండించింది. యోదుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది. అతని తెగువ ధైర్య సాహసాలు దానికి సాక్ష్యం. అంటూ సమంత తన పోస్ట్ లో పేర్కొంది. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు నేరుగా యుద్ద రంగలోకి దిగడం ఆర్మీ తో కలిసి తన ప్రజల కోసం ఫైట్ చేయడాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

Visitors Are Also Reading