Home » Samantha: మ‌రొక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్‌..!

Samantha: మ‌రొక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్‌..!

by Anji
Ad

టాలీవుడ్ హీరోలు, హీరోయిన్‌లు పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు తీస్తున్న విష‌యం తెలిసిందే. టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌ల‌లో ఒక‌రైన స‌మంత సినీ ఇండ‌స్ట్రీలో ఎన్నో క‌ష్టాల‌ను, స‌వాళ్ల‌ను ఎదుర్కొని ఒక్కోమెట్టు ఎక్కుతూ పైకి వ‌చ్చింది. వృత్తిప‌రంగానే కాకుండా వ్య‌క్తిగ‌తంగా కూడా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కుంది. ఏమాయ‌చేశావే సినిమాతో కుర్ర‌కారు మ‌న‌సు దోచుకున్న ఈ భామ‌.. ఆ త‌రువాత న‌ట‌న‌ప‌రంగా ఎన్నో విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కుంది. కొంత మంది అందంతోనే నెట్టుకొస్తుంద‌ని.. మ‌రికొంద‌రూ యాక్టింగ్ రాద‌ని ఎవ‌రికి తోచిన విధంగా వారు పెద‌వి విరిచారు. అయినా అవేమి ప‌ట్టించుకోకుండా వారంద‌రి నోర్లు మూయించేవిధంగా త‌న ప్ర‌తిభ చాటి.. ప్ర‌స్తుతం జాతీయ స్థాయిలోనే త‌న స‌త్తా చాటుతోంది.

Advertisement

ఇక నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న త‌రువాత నుండి స‌మంత ఫుల్ బిజీ అయిపోయింది. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌ను చేస్తూనే ఉంది. ద ఫ్యామిలీ మ్యాన్‌-2 సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది స‌మంత‌. ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లోనూ న‌టిస్తుంది. తాజాగా మ‌రో పాన్ ఇండియా మూవీకి సంత‌కం చేసిన‌ట్టు స‌మాచారం. డెబ్యూ డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ‌తో ఇంప్రెస్ అవ్వ‌డంతో ఈ సినిమా చేసేందుకు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలుస్తోంది.

Advertisement

 

అయితే ఆ ద‌ర్శ‌కుడితో పాటు ఇత‌ర నటీ నటులు, సాంకేతిక నిపుణుల బృందం వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా.. స‌మంత ప్ర‌స్తుతం శాకుంత‌లం, య‌శోద చిత్రాల‌తో చాలా బిజీగా ఉంది. ఈరెండు సినిమాల ప‌నులు దాదాపు తుది ద‌శకు చేరుకున్నాయి. పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు ముగిసిన వెంట‌నే విడుద‌ల‌కు సిద్ధం కానున్నాయి. మ‌రొక‌వైపు వెబ్‌సిరీస్‌కు అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ రెండు సినిమాలు ఎంత మేర‌కు ఆక‌ట్టుకుంటాయో చూడాలి.

Also Read :

కరాటే కళ్యాణి గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఆమె తల్లి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

ఎన్టీఆర్ చిరుని తొక్కేయకుండా అల్లు రామలింగయ్య గారు ఆపరా ? తెరవెనుక ఇంత జరిగిందా..?

 

Visitors Are Also Reading