Home » Saithan Web Series Review: : చెప్పలేనన్ని బూతులు.. “సైతాన్” వెబ్ సిరీస్ రివ్యూ!

Saithan Web Series Review: : చెప్పలేనన్ని బూతులు.. “సైతాన్” వెబ్ సిరీస్ రివ్యూ!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఇటీవల వెబ్ సిరీస్ లకు కూడా ఎక్కడలేని ఫాలోయింగ్ వచ్చేస్తుంది. సినిమాల తరహాలోనే ఇవి కూడా ప్రత్యేక ప్రేక్షకులని సంపాదించుకుంటున్నాయి. ఓటిటిలు అందుబాటులోకి వచ్చాక సిరీస్ లను చూడడం ఎక్కువైందనే చెప్పాలి. తాజాగా హాట్ స్టార్ లో రిలీజ్ అయిన సైతాన్ వెబ్ సిరీస్ ఎలా ఉందొ చూద్దాం.

Advertisement

యాక్టర్స్: రవి కాలే, దేవయాని శర్మ, రిషి, షెల్లీ, నితిన్, జాఫర్ సాదిక్
ప్రొడ్యూసర్స్: మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి
రచన-డైరెక్టర్: మహి వి రాఘవ్
మ్యూజిక్ : శ్రీరామ్ మద్దూరి
సినిమాటోగ్రఫీ: షణ్ముగ సుందరం
ఓటిటి: డిస్నీ+హాట్స్టార్

స్టోరీ:
సావిత్రి అనే మహిళ( షెల్లీ) కి బాలి (రిషి), జయ (దేవయాని), గుంతి (జాఫర్ సాదిక్) ముగ్గురు పిల్లలు. ఆమెను భర్త వదిలేసి వెళ్ళిపోతాడు. దీనితో ముగ్గురు పిల్లలను పెంచుకోవడానికి ఓ పోలీస్ అధికారికి ఉంపుడుగత్తె గా ఉంటుంది ఆమె. దీనితో ఇరుగుపొరుగువారు ఆమెను నానామాటలు అంటుంటారు. ఈ పని చేయొద్దని బాలి ఆమెను కోరతాడు. మీరు పెద్ద అయితే చెయ్యను అని ఆమె చెప్తుంది. పని చేద్దామని అనుకుంటే బాలికి ఎవ్వరూ పని ఇవ్వరు. ఈలోపు తల్లి కోసం వచ్చిన పోలీస్ అధికారి కన్ను చెల్లి జయపై పడుతుంది.

saithan

Advertisement

చెల్లిని బలవంతం చేశాడన్న కారణంతో ఆ పోలీస్ అధికారిని కొట్టి చంపేస్తారు. ఈ కేసులో బాలి జైలుకు వెళ్లి, కొన్ని రోజుల తరువాత తిరిగి వస్తాడు. తర్వాత కుటుంబంతో కలిసి మరిన్ని నేరాలు చేస్తాడు. బాలి ఎందుకు నేరాలు చెయ్యాల్సి వచ్చింది? తమ్ముడు గుంతిని చంపిందెవరు? తన జీవితంలో పోలీస్ అధికారి పాత్ర ఎంత? చివరికి బాలి ఎందుకు చనిపోతాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

shaitan new

 

విశ్లేషణ:
క్రైం నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ లో చెప్పుకోలేనన్ని బూతులు ఉంటాయి. ఈ సిరీస్ డైరెక్టర్ గతంలో పాఠశాల, ఆనందోబ్రహ్మ, యాత్ర వంటి సినిమాలు తీశారు. ఎక్కడా వల్గారిటీ మచ్చుకైనా కనిపించదు. కానీ, ఈ వెబ్ సిరీస్ చాలా బోల్డ్ గా ఉంటుంది. కేవలం ఓ వర్గం వారు మాత్రమే ఈ వెబ్ సిరీస్ ను చూడగలరు. మొదటి నుంచి ఇది ఫ్యామిలీ తో కలిసి చూసే వెబ్ సిరీస్ కాదని డైరెక్టర్ చెబుతూనే వచ్చారు. మొదటి ఎపిసోడ్ లోనే “సైతాన్” వరల్డ్ లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అయితే బోల్డ్ కంటెంట్ ను ఇష్టపడేవారికి ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది.

మరిన్ని ముఖ్య వార్తలు:

కుబేరుడికి తిరుమల శ్రీనివాసుడు రాసిచ్చిన పత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా ?

10వ బ్యాట్స్ మెన్ గా వచ్చి.. సెంచరీలు చేసిన క్రికెటర్స్ వీరే..!

రాజమౌళి-అల్లరి నరేష్ కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏదో తెలుసా ?

Visitors Are Also Reading